telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్

Sushanth

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుకు సంబంధించిన డ్రగ్స్ ఆరోపణలపై రియా చక్రవర్తిని సెప్టెంబర్ 9 న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఇప్పుడు పూర్తిగా డ్రగ్స్ కోణంవైపు మళ్లింది. ఇందులో ప్రముఖ నటీనటుల పేర్లు బయటకు వస్తున్నాయి. దీంతో ఈ కేసు బాలీవుడ్ లో సంచలనంగా మారింది. మరోవైపు సుశాంత్ అనుమాస్పదంగా మృతి చెంది 4 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు మిస్టరీగానే మిగిలింది. అలా ఈ కేసు విషయంలో ఇప్పటి వరకు ఒక్కోరోజు ఒక్కో ట్విస్ట్ తో కొనసాగుతుంది. సుశాంత్ ది హత్యే అయ్యి ఉంటుంది అని అనేక అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఇటీవలే ఎయిమ్స్ వారు అందించిన రిపోర్ట్ ప్రకారం ఇది ఆత్మహత్యే అని తెలిపారు. సుశాంత్ ఒంటిలో ఎలాంటి విషం లేదని అది ఆత్మహత్యే అని అన్నారు. కానీ ఈ కేసును టేకప్ చేసిన సిబిఐ వారు లేటెస్ట్ ట్విస్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వారు ఆత్మ హత్య అని చెప్పినప్పటికీ తాము ఇది ఆత్మ హత్యా, హత్యా అన్నది తేల్చలేకపోతున్నామని అందుకే ఈ కేసును హత్యా కేసు సెక్షన్ 302లో చేర్చారట. సుశాంత్ ను కేవలం పాయిజన్ ఇచ్చి హతమార్చకున్నా వేరేలా చేసి ఉండొచ్చు కదా అనే కొత్త పాయింట్ ను వీరు రైజ్ చేశారట. దీనితో ఈ కేసు ఇపుడు మరో సరికొత్త మలుపు తిరిగినట్టు అయ్యింది.

Related posts