telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తెరపైకి మళ్ళీ ప్రభాస్ పెళ్ళి… అమెరికా అమ్మాయితో… !

Saaho

“బాహుబ‌లి” చిత్రంతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రభాస్. “బాహుబ‌లి” కోసం దాదాపు ఐదేళ్ల సమయాన్ని కేటాయించాడు ప్ర‌భాస్. ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తరువాత ఆయ‌న తాజాగా నటిస్తున్న భారీ చిత్రం “సాహో”. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం దాదాపుగా రెండేళ్ళ సమయాన్ని కేటాయించాడు ప్రభాస్. ఆగ‌స్ట్ 30న విడుద‌ల కానున్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి కొద్ది రోజుల‌లో 40లోకి అడుగుపెట్ట‌నున్న ప్ర‌భాస్ ఎప్పుడు పెళ్ళి చేసుకుంటాడ‌నే విషయమై అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గ‌తంలోనే బాహుబలి సినిమా సమయంలో ప్ర‌భాస్ పెళ్ళికి సంబంధించి ప‌లు వార్త‌లు ప్రచారం అయ్యాయి. అయితే వాటిని ప్ర‌భాస్ పెద్ద‌నాన్న కృష్ణం రాజు ఖండించారు. స‌రైన స‌మ‌యంలో మేమే అఫీషియ‌ల్ ప్ర‌కట‌న చేస్తామ‌ని చెప్పుకొచ్చారు. కానీ తాజాగా మరోసారి ప్రభాస్ పెళ్ళికి సంబంధించిన ప్రచారం జోరుగా సాగుతోంది సోషల్ మీడియాలో. ఈ వార్తల సారాంశం ఏమిటంటే… అమెరికాలో వ్యాపారిగా స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి కూతురితో ప్రభాస్ పెళ్లి జరగనుందని చెబుతున్నారు. మ‌రి ఇందులో ఎంత నిజ‌ముంద‌నే విషయం తెలియాలంటే ప్రభాస్ స్పందించాల్సిందే. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సాహో ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్నాడు. మరోవైపు రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు.

Related posts