telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు విద్యా వార్తలు

ఏపీలో మరో.. ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్..

govt job notifications in andhrapradesh

ఆంధ్రప్రదేశ్ లో మరో ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు విడుదల అయిన విషయం తెలిసిందే. తాజాగా, విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల నియమానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు మంత్రి కళావెంకటరావు చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ రంగం సంస్థల్లో ఖాళీలుగా ఉన్న అన్ని ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని. ముఖ్యంగా విద్యుత్ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖలో ఏపి ట్రాన్స్‌కో, ఏపి ఎస్పీడీసీఎల్, ఏపి ఈపీడిసియల్ సంస్థల్లో అసిస్టెంట్‌ ఇంజనీర్ పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు తెలిపారు.

మొత్తంగా 206 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని దీనిలో 171 పోస్టులు ఏపి ట్రాన్స్‌కో, 20 పోస్టులు ఏపి ఎస్పీడీసీఎల్, 15 పోస్ట్‌లు ఏపి ఈపిడిసియల్ ద్వారా నియామక ప్రకటన జారీచేశామన్నారు. విద్యుత్‌ సంస్థలైన ఏపి ట్రాన్స్‌కో, ఏపిడిస్కమ్స్ సమావేశంలో పెరిగిన విద్యుత్ వినియోగదారుల అవసరాలు, ప్రాజెక్ట్ అవసరాలకు అనుగుణంగా ఈ నియామకాలు చేపట్టాలని ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయించామని విద్యుత్ శాఖ మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

Related posts