telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ సామాజిక

దేశంలో మతకల్లోలాలకు తెర లేస్తుందా.. !! మసీదులలోకి మహిళలు..

supreme court two children petition

రోజురోజుకు దేశంలో మతపరమైన విషయాల్లో తమ మనోభావాలు దెబ్బతింటున్నాయనీ .. లింగ వివక్ష కారణంగా తమ స్వేచ్చ .. స్వాతంత్య్రాలు హరించబడుతున్నాయని న్యాయస్థానాన్ని ఆశ్రయించే మహిళల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే మశీదుల్లోకి ముస్లీమ్ మహిళలు రాకుండా ఆంక్షలు విధించడం రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలనీ, ముస్లిం మహిళలు మసీదుల్లో ప్రార్థనలు జరుపుకునేలా అనుమతిని ఇవ్వాలని కోరుతూ పూణెకి చెందిన దంపతులు సుప్రీమ్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

సర్వోన్నత న్యాయస్థానం మసీదుల్లోకి ముస్లిమ్ మహిళల ప్రవేశానికి చట్ట బద్ధంగా అనుమతించాలని కోరుతూ దాఖలు చేయబడిన పిటీషన్ ను పరిశీలించింది. ఈ విషయంపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం, ఏ దేశంలోనైనా సరే మసీదుల్లోకి ముస్లీమ్ మహిళలలను అనుమతిస్తున్నారా? అని పిటీషనర్ల తరఫు న్యాయవాదులను అడిగింది. కెనడా .. మక్కాల్లో అనుమతిస్తున్నారని వాళ్లు సమాధానమివ్వడంతో, ఈ పిటీషన్ పై విచారణ జరిపేందుకు సుప్రీమ్ కోర్టు అంగీకరించింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కేసులో తీర్పు ఇచ్చినందువల్లనే ఈ పిటీషన్ ను స్వీకరించినట్టు జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

Related posts