telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగా ఫ్యామిలీ నుండి .. మరో హీరో ..

another hero from mega family

ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు పరిచయం అయ్యారు. పాత తరం సినిమాల్లో హాస్యానికి కొత్త భాష్యం చెప్పిన నటులు నవ్వుల రారాజు అల్లూ రామలింగయ్య వారసుడు అల్లు అరవింద్ నటుడిగా కొనసాగుతూ ప్రొడ్యూసర్ గా స్థిరపడ్డారు. ఆయన తనయుడు అల్లు అర్జున్ ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా పరిచయం అయి ఇప్పుడు టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. మరో వారసుడు అల్లు శిరీష్ ‘గౌరవం’ సినిమాతో హీరోగా పరిచయం అయినా పెద్దగా సక్సెస్ సాధించలేక పోతున్నాడు. అల్లు అరవింద్ కు బంధువైన విరాన్ ముత్తంశెట్టి కూడా నటన పట్ల తనకున్న అభిరుచిని చాటుకునేందుకు హీరోగా పరిచయం కాబోతున్నారు. పి.సి.ఎం. స్టూడియో, మైత్రి అసోసియేషన్ పతాకాలపై చిట్టిశర్మ దర్శకత్వంలో సి.హెచ్.వి.యస్.ఎన్. 

బాబ్జి ప్రొడక్షన్ నెం.1గా నిర్మించే చిత్రం ద్వారా విరాన్ ముత్తంశెట్టి అరంగేట్రం చేయబోతున్నారు. ఈ సినిమా విభిన్నమైన కోణంలో సాగుతుందని..దేవుడి ఉనికే ప్రశ్నగా మారిన ఇప్పటి లోకానికి ఆ దేవుడిని పరిచయం చేసిన ఓ యువకుడి కథే ఈ మూవీ అని నిర్మాత సి.హెచ్.వి.యస్.ఎన్. బాబ్జి తెలిపారు. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ భాషలలో ఈ మూవీ రూపొందించనున్నట్లు.. డివోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుందని చిత్ర యూనిట్ తెలిపారు. రెగ్యులర్ షూటింగ్ జూన్ మొదటివారం నుంచి ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. ఈ మూవీకి సంగీతం-జీబు, కెమెరా-సూర్యప్రకాష్, ఎడిటింగ్-ఆవుల వెంకటేష్, ఆర్ట్-జి.బాబ్జి, సహ నిర్మాత-ఇ.ధర్మప్రసాద్, నిర్మాత-సి.హెచ్.వి.యస్.ఎన్.బాబ్జి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం-చిట్టిశర్మ. 

Related posts