telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మరో మహిళ .. జీవితాన్ని ప్రశ్నించిన.. ఫేస్ బుక్..

Facebook shocking comments

సామజిక మాధ్యమాలు వివిధ కారణాల చేత దూరంగా ఉన్న వారితో అతిదగ్గరగా ఉన్నట్టుగా ఉండేందుకు ఉపకరించేందుకు ఉద్దేశించినవి, కానీ నేడు అవి వేరొక మార్గంలో తప్పుగా ఉపయోగిస్తూ.. వాటివిలువను దిగజారుస్తున్నారు కొందరు. అందుకే ఫేస్ బుక్ వంటి సామజిక మాధ్యమాల ద్వారా రోజురోజుకు దారుణాలు జరగటం పెరిగిపోతుంది. దీనితో చాలా మంది దానిని ఉపయోగించడమే మానేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఈ మాధ్యమం వలన మరో మహిళ చేదు అనుభవాన్ని చూడాల్సి వచ్చింది. వివరాలలోకి వెళితే, స్నేహం పేరుతో ఓ యువతిని నమ్మించిన యువకుడు దారుణానికి తెగబడ్డాడు. యువతిని ఓ హోటల్ లో బంధించి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు. ఈ అఘాయిత్యాన్ని వీడియో తీసి తనను పెళ్లి చేసుకోవాలని బెదిరింపులకు దిగాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ జిల్లాలో చోటుచేసుకుంది.

షామ్లీ జిల్లాకు చెందిన సోనూ అనే యువకుడికి ఓ యువతి(23) ఫేస్ బుక్ లో పరిచయమైంది. పరిచయం పెరగడంతో ఇద్దరూ ఓ హోటల్ లో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ముందుగా అనుకున్నట్లు యువతి హోటల్ గదిలోకి రాగానే సోనూ తన సోదరులతో కలిసి ఆమెను బంధించాడు. అనంతరం వారితో కలిసి బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని స్మార్ట్ ఫోన్ లో చిత్రీకరించాడు. అనంతరం తనను పెళ్లి చేసుకోవాలని సోనూ ఆమెను డిమాండ్ చేశాడు. లేదంటే ఈ వీడియో వైరల్ గా మారుతుందని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts