క్రైమ్ వార్తలు వార్తలు హాస్యం

మరో కుటుంబం బలి … హత్యా? ఆత్మహత్యా?

ఒక కుటుంబంలోని మొత్తం ఐదుగురు సభ్యులు చనిపోయి వుండడం కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్, అలహాబాద్ లోని, ధూమంగంజ్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ విషాదం వెలుగులోకి వచ్చింది. అనుమానాస్పద పరిస్థితిలో మృతదేహాలు పడివుండటం పలు సందేహాలకు తావిస్తోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఇంటి తాళం వేసి వుండటంతో పగుల గొట్టి ప్రవేశించిన పోలీసులు అనుమానాస్పద స్థితిలో ఐదు మృతదేహాలను గుర్తించారు.

ఓక వ్యక్తి ముందుగదిలో ఉరికి వేలాడుతూ కనిపించగా, లోపల ఫ్రిజ్ లో మహిళా మృతదేహం కనిపించింది. ఇద్దరు కుమార్తె శవాలు సూట్ కేస్ లో, బీరువాలో కుక్కి వుండగా, మూడవ కుమార్తె శవం మరో గదిలో పది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని సీనియర్ పొలిసు అధికారి చెప్పారు. భార్య, ముగ్గురు కుమార్తెలను హత్య చేసి భర్తకూడా ఆత్మహత్య చేసుకొని వుండొవచ్చనే సందేహాన్ని అలహాబాద్ సీనియర్ సూపరింటెండెంట్ నితిన్ తివారీ వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Related posts

విశాఖ మ్యాచ్ టై…ఒక్క పరుగుతో.. విజయం ఎటు కాకుండా…

chandra sekkhar

బిజీగా లేనప్పటికీ చెర్రీకి తో నటించేందుకు నో చెప్పిన రకుల్.. ఎందుకంటే 

jithu j

నిరంతరం జాగ్రత్తగా చూసుకుంటాను నాగ్.. సంచలంగా మారిన రష్మిక

nagaraj chanti

Leave a Comment