telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

మళ్ళీ .. శ్రీలంకలో .. పేలుళ్లు.. ఇద్దరు మృతి ..

another blast in srilanka 2 died total 129 died

శ్రీలంకలోని మూడు చర్చిలు, మరో మూడు స్టార్ హోటళ్లలో ఈరోజు ఉదయం పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా, కొలంబోలో మరోమారు పేలుడు సంభవించింది. స్థానిక దేహివాలాజ్ సమీపంలో బాంబు పేలడంతో ఇద్దరు మృతి చెందారు. కాగా, శ్రీలకంలో తాజా ఘటనతో సహా ఉదయం జరిగిన పేలుళ్లలో మృతుల సంఖ్య దాదాపు 250. మూడు వందలకు పైగా గాయాలు పాలయ్యా రు. బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారిలో 35 మంది విదేశీయులు ఉన్నారు.

ఈ తరహా దాడుల్లో విదేశీయులు మృతి చెందడం ఇదే మొదటిసారి అని సమాచారం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు అధిక సంఖ్యలో ఉండటంతో వారికి చెందిన గ్రూప్ రక్తం ఎక్కించడం కష్టంగా మారింది. ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ లలో రక్త నిల్వలు లేకపోవడంతో క్షతగాత్రులకు రక్తం ఎక్కించడం సాధ్యపడక పలువురు మృతి చెందారు. ఇదిలా ఉండగా,ఈ ఘటనతో కొలంబోలో కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూ ఎప్పుడు ఎత్తివేసి విషయం అధికారులు ప్రకటించలేదు.

ఈ పేలుళ్లకు ఇప్పటికే భారత రాష్ట్రపతి, ప్రధాని, ఏపీసీఎం చంద్రబాబు ఖండించారు. అవసరమైన సాయాన్ని అందిస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది.a

Related posts