telugu navyamedia
andhra crime culture news trending

8 లక్షలతో శవానికి .. ప్రాణం పోస్తా..

Hyderabad Wisdom Jobs Portal Cheat youth

లక్షలు పెట్టైనా పోయిన ప్రాణాన్ని తేలేము.. ఇది తెలిసి కూడా ఎవరో ఏదో చెప్పారని పోయిన ప్రాణాలతోపాటుగా నగదు కూడా పోగొట్టుకోవడం ఎంతవరకు సమంజసం. ఈ దేశంలో గురువులు, మహానుబావులు(వీరందరూ తల్లిలాగే ఉదారస్వభావులు, వారు ఏమీ ఆశించరు) చాలామంది ఉన్నారు.. ఒప్పుకోవాల్సిందే. అయితే వారెవరు ప్రాణాలు పోయడానికి, రోగాలు తగ్గించడానికి నగదు లాంటివి ఏమి అడగరు.. దీనిని అందరూ గుర్తుంచుకుంటే, ఇలాంటి మోసాలు జరగవు. కానీ, వల్లమాలిన ప్రేమ, తాపత్రయం కొన్నిసార్లు ఎలాంటి తప్పులు చేపిస్తుందో.. అన్నదానికి ఇదొక ఉదాహరణ; నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలంలోని పెట్లూరుకు చెందిన టాక్సీ డ్రైవర్ తుపాకుల శ్రీనివాస్ 40 రోజుల క్రితం డెంగీతో మృతి చెందాడు. అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. అయితే, శ్రీనివాస్ మరణించడానికి ముందు రైల్వేకోడూరులో ఓ వ్యక్తితో గొడవ పడ్డాడు. దీనితో కుటుంబ సభ్యుల్లో అనుమానం తలెత్తింది. ఆ వ్యక్తి చేతబడి చేయడం వల్లే శ్రీనివాస్ మృతి చెందాడని బలంగా నమ్మారు.

చనిపోయిన శ్రీనివాస్‌ను ఎలాగైనా బతికించుకోవాలని కుటుంబ సభ్యులంతా ఓ నిర్ణయానికి వచ్చారు. అనుకున్నదే తడవుగా క్షుద్రపూజలు చేసే ఓ తాంత్రికుడిని సంప్రదించారు. శ్రీనివాస్‌ను బతికిస్తానని అతడు హామీ ఇచ్చాడు. శ్రీనివాస్‌ను సమాధి చేసిన ప్రాంతంలో 41 రోజులు పూజలు చేయాలని, అందుకు రూ. 8 లక్షలు ఖర్చవుతుందని చెప్పాడు. ఆ 41 రోజులూ శ్మశానంలోనే శ్రీనివాస్‌ కోసం ఎదురు చూస్తూ ఉండాలని షరతు విధించాడు. అప్పటి నుంచి వారు శ్రీనివాస్ కోసం శ్మశానంలోనే పడిగాపులు కాస్తున్నారు. విషయం తెలిసిన గ్రామస్థులు అక్కడి నుంచి వెళ్లాల్సిందిగా కోరితే వారిపైనే తిరగబడ్డారు. కత్తులతో బెదిరించారు. దీనితో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు శ్మశానానికి చేరుకున్న పోలీసులు శ్రీనివాస్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చి పంపించాల్సి వచ్చింది.

Related posts

ఏ ఒక్క ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరడం లేదు: భట్టి విక్రమార్క

vimala p

ఆన్లైన్ లో “మహర్షి” సీన్స్ లీక్…!?

vimala p

ఎన్టీఆర్ కు మేకప్ వేశాను : మోహన్ బాబు

vimala p