telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ : … కాలుష్య నివారణకు చర్యలు.. మరో 60 ఎలక్ట్రిక్ బస్సులు..

electric buses on roads of hyderabad with ac charges

నగరంలో కాలుష్యనివారణకు కొత్తగా మరో 60 ఎలక్ర్టిక్ బస్సులు రానున్నాయి.. దేశంలోని 11 నగరాల్లో మొదటిదశలో ప్రవేశపెట్టిన బస్సుల్లో మనకు మొదటి విడతలో 40 బస్సులు రాగా మరో 60 బస్సులు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వాస్తవానికి మేలోనే నగర రోడ్లపై రాకపోకలు సాగించాల్సి ఉన్నప్పటికీ కేంద్రం నుంచి మంజూరు లభించలేదు. ఇటీవలే కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రిత్వశాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొత్త బస్సులు రాష్ర్టానికి రానున్నాయి. నగరంలో తిరుగుతున్న బస్సుల్లో చాలా వరకు పాత బస్సులు నడిపిస్తున్నారు. ఇవి సర్వీసును అందించలేకపోతున్నాయి. తరుచుగా రోడ్లపై మొరాయించడంతో సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు.

మొదటిదశలో ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులు జేబీఎస్, మియాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాల నుంచి ఏయిర్‌పోర్టుకు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ బస్సుల ఆపరేషన్ రేషియో ప్రారంభంలో అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం పెరిగింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దశలవారీగా ప్రజా రవాణాకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతుంది. ఇందులో భాగంగా మొదటిదశలో 11భారతీయ నగరాల్లో వీటిని ప్రవేశపెట్టాలని నిర్ణయించగా, అందులో మన హైదరాబాద్ నగరం కూడా ఉన్నది. కంటోన్మెంట్, మియాపూర్ డిపోల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి 20 చొప్పున సర్వీసులు నడుపుతున్నారు. ఇదే తరహాలో మరో 60 బస్సులను తెచ్చి నగరంలోని ప్రధాన రూట్లలో తిప్పనున్నట్లు తెలిపారు. ఇప్పటికే మెట్రోరైలు అందుబాటులోకి రావడంతో దీని ప్రభావం నగర టీఎస్‌ఆర్టీసీపై తీవ్రంగా పడటంతో కొత్తగా తీసుకురానున్న బస్సులను రద్దీ మార్గాల్లో తిప్పాలనే ఆలోచనతో ఉన్న అధికారులు ఇప్పటికే రూట్ సర్వే పూర్తిచేశారు.

Related posts