telugu navyamedia
study news

ఈ నెల 15 వరకు ‘అన్నామలై’ దూర విద్యకు అడ్మిషన్లు

Annamalai university,admissions started
తమిళనాడుకు చెందిన అన్నామలై యూనివర్సిటీ 2019-20 విద్యాసంవత్సరానికి డిగ్రీ, పీజి కోర్సుల్లో చేరడానికి అడ్మిషన్లు జరుగుతున్నాయని సంస్థ డైరెక్టర్‌ వీరబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌, డిప్లమో, పీజీ డిప్లమో, బీఎల్‌ఐసీ, ఎంఎల్‌ఐసీ, బీసీఎ, ఎంసీఎ, ఎల్‌ఎల్‌బీతో పాటు యోగా కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఉన్నట్లు పేర్కొన్నారు. 
ఈ ఏడాది నుంచి బీఈడీ, పీహెచ్‌డి, బీ ఫార్మా, డీ ఫార్మా, కోర్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. చెన్నై అన్న్నామలై నగర్‌లో ఉన్న యూనివర్సిటీ క్యాంపస్‌లో పీసీబీ కోర్సుల్లో భాగంగా ప్రత్యేక యోగా కోర్సుకు ఈ నెల 15వ తేదీతో గడువు ముగుస్తుందని వివరించారు డిగ్రీ మధ్యలో ఆపేసిన విద్యార్థులకు ఒన్‌ సిటింగ్‌ ద్వారా పూర్తి చేసే అవకాశాన్ని కల్పించామని తెలిపారు. ఆసక్తి గల వారు  9133090105లో సంప్రదించాలని సూచించారు.

Related posts

నేడు తెలంగాణ ఈసెట్ ప్రవేశ పరీక్ష

vimala p

గ్రామ సచివాలయ ఉద్యోగాలకు .. నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

vimala p

తెలంగాణ : .. ఐఏఎస్ లను .. యూనివర్సిటీ ఇంచార్జ్ వీసీలుగా ..

vimala p