telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఏడవరోజుకు చేరిన .. అన్నా హజారే దీక్ష.. డిమాండ్ నెరవేర్చకపోతే గ్రామం అంతా ఆత్మాహుతే ..

annahajare village supports him for demands

సామాజిక కార్యకర్త అన్నా హజారే కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్త ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌పై చేస్తున్న దీక్ష ఏడవ రోజుకు చేరుకుంది. అయితే అన్నా ఇప్పటి వరుకు 5.5 కిలోల బరువు కోల్పోయారు. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. ఈ విషయం ఆయనకు తెలిపాం. షుగర్ లెవల్ తగ్గిపోయింది. సాధ్యమైనంత త్వరగా నిరాహార దీక్ష విరమించాలని కోరాం’ అని డాక్టర్ ధనంజయ్ పోతె తెలిపారు.

సెలైన్ లేదా ఓఆర్ఎస్ తీసుకోవాలని తాము సూచించినప్పటికీ ఆయన నిరాకరిస్తున్నారని, ఇదేవిధంగా నిరాహార దీక్ష సాగిస్తే మూత్రపిండాలు, మెదడు దెబ్బతినే ప్రమాదం ఎంతైనా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 81 ఏళ్ల అన్నా హజారే జనవరి 30 నుంచి నిరాహార దీక్ష సాగిస్తున్నారు. కాగా గ్రామంలో ఏ ఒక్కరూ ఇంట్లో వంట చేసుకోకుండా హజారే దీక్షలో పాల్గొన్నారని రాలేగావ్ సిద్ధి డిప్యూటీ సర్పంచ్ లంకేష్ తెలిపారు. అన్నాజీ డిమాండ్లు నెరవేరకుంటే గ్రామమంతా ఆత్మాహుతి చేసుకుంటుందన్నారు.

Related posts