telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఏపీలో అన్నదాత సుఖీభవ.. 10వేలపైనే..నేడే బ్యాంకు ఖాతాలలోకి..

annadata sukhibhava scheme from today

ఏపీ రైతులకు చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద రైతులకు సోమవారం తొలివిడుత సొమ్ము వారి బ్యాంకు ఖాతాల్లో జమకానుంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మంది రైతు కుటుంబాలకు వారి బ్యాంకుల్లో వెయ్యి రూపాయల చొప్పున నగదు జమ కానుంది. ఈ మేరకు జీవో విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు 15 వేలు, మిగతా రైతులకు 10 వేలు అందనున్నాయి. అయితే.. ఈ స్కీమ్‌ను కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్ పథకంతో లింకప్‌ చేస్తారు. ఐదు ఎకరాల్లోపు రైతులకు కేంద్రం 6 వేలు అందింస్తుండగా , ఏపీ సర్కార్‌ మిగతా 9 వేలు ఇస్తుంది. మిగిలిన అన్నదాతలకు మొత్తం 10 వేలు సాయంగా అందిస్తుంది ఏపీ సర్కారు.

ఈ పథకం అమలుతో రాష్ట్ర ప్రభుత్వానికి 6 వేల 500 కోట్లు వరకు ఖర్చవుతుందని అంచనా. రాష్ట్రంలో 54 లక్షల రైతు కుటుంబాలున్నాయని అంచనా. ఒక్కో కుటుంబానికి 15 వేల రూపాయలు వస్తాయి. ఇక ఐదు ఎకరాల పైన ఉన్న కుటుంబాలు 8 లక్షల వరకు ఉన్నాయి. అయితే వీరికి కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందదు. కానీ రాష్ట్రమే కుటుంబానికి 10 వేల చొప్పున ఇస్తుంది. వీరితో పాటు కౌలు రైతుకు కూడా పెట్టుబడి సహాయం అందిస్తామని ప్రకటించింది ఏపీ సర్కారు వీరు దాదాపు 8 లక్షలకు పైగా ఉంటారని అంచనా. వీరికి 10 వేల చొప్పున సాయం అందించనుంది ఏపీ సర్కారు.

Related posts