telugu navyamedia
సినిమా వార్తలు

జైకి ఇంకా పెళ్ళి కాలేదు… తమిళ అబ్బాయినే పెళ్ళి చేసుకుంటా… : అంజలి

actor anjali on her marriage and life

తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ నటిగా మంచి పేరు సంపాదించుకున్న తెలుగమ్మాయి అంజలి. తాజాగా విజయ్‌ సేతుపతి, అంజలి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం “సింద్‌బాద్‌”. ఈ చిత్రం శుక్రవారం విడుదల కావాల్సివుండగా… కొన్ని అనివార్య కారణాలతో ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రాల గురించి, ఇతర విషయాల గురించి అంజలి మీడియాతో ముచ్చటించారు. సినిమాలో విజయ్ సేతుపతి కొంచెం చెవుడు కలిగిన పాత్రలో కనిపిస్తారని.. తాను గ్రామంలో నివసించే సాధారణ యువతిగా నటించానని చెప్పింది. హీరోల్లో మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా…? అని ప్రశ్నించగా.. తాను నటించిన హీరోలలో ఎక్కువమందికి పెళ్లిళ్లు అయ్యాయని చెప్పింది. నటుడు జైకే ఇంకా పెళ్లి కాలేదని.. తను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో తెలియదని చెప్పింది. గతంలో వీరిద్దరిపై ప్రేమ వార్తలు విన్పించడమే కాకుండా పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయారనే ప్రచారం సాగింది. అయితే అంజలి తాను పెళ్లి చేసుకుంటే మాత్రం తమిళ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని, తమిళ చిత్రాలలో నటిస్తున్నా హైదరాబాద్ లోనే నివసిస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మాధవన్, అనుష్కలు నటిస్తోన్న “సైలెన్స్” సినిమాలో కీలకపాత్రలో నటిస్తోంది.

Related posts