telugu navyamedia
సినిమా వార్తలు

11 ఏళ్ల డేటింగ్… వివాహమై 35 ఏళ్ళు… ఇంకా 46 ఏళ్ళు కావాలి : అనిల్ కపూర్

Anil-Kapoor

ఈరోజు బాలీవుడ్ స్టార్ నటుడు అనిల్ కపూర్ 35వ వివాహ వార్షికోత్సవం. ఈ నేపథ్యంలో భార్య సునీత కపూర్ పై అనిల్ ప్రశంసల వర్షం కురిపించారు. “నా జీవితంలో జరిగిన గొప్ప ఘటన ఏదైనా ఉందంటే అది నువ్వే. జీవితంలో మనిద్దరి ప్రయాణం సాహసోపేతంగా సాగింది. 11 ఏళ్ల డేటింగ్ తో పాటు వివాహమై 35 ఏళ్లు అప్పుడే పూర్తయిపోయాయి. ఇంకో 46 సంవత్సరాల పాటు నీతో కలిసి జీవించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. వివాహ దినోత్సవ శుభాకాంక్షలు సునీతాకపూర్.. ఐలవ్ యూ” అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సునీతతో దిగిన ఫొటోను అనిల్ కపూర్ ట్వీట్ కు జతచేశారు.

Related posts