telugu navyamedia
సామాజిక సినిమా వార్తలు

ఎన్నికల ఫలితాలు… ఓటు ఎందుకు వేయలేదో వెల్లడించిన హీరో 

Anil-Kapoor
లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా… గెలుపెవరిది అన్న విషయమై ఉత్కంఠ నెలకొంది. చాలామంది బాలీవుడ్ నటులు లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే అక్షయ్‌కుమార్, అలియాభట్ తదితరులు ఓటు వేయలేదు. వీరికి భారత పౌరసత్వం లేకపోవడంతో వీరు ఓటు వేయలేకపోయారు. అయితే భారతీయ పౌరులైనప్పటికీ కొంతమంది నటులు తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు.
వారిలో బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ఒకరు. “మిస్టర్ ఇండియా” అనిల్‌కపూర్, అతని భార్య లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయలేదు. దీని గురించి విలేకరులు ఆయనను ప్రశ్నించగా… తాను ఆ సమయంలో భుజం నొప్పి చికిత్స కోసం మ్యూనిచ్ వెళ్లానని, తన భార్య కూడా తనతో పాటే ఉందని, అయినప్పటికీ ఆరోజు ఓటు వేసేందుకు జర్మనీలోని ఎంబసీని సంప్రదించామని, కానీ ఓటు వేయడం సాధ్యం కాదని తేలిందని, భవిష్యత్‌లో అయినా మనం ఎక్కడున్నా సరే ఓటు వేసేందుకు అవకాశం కలుగుతుందని ఆశిస్తున్నానని అన్నారు.

Related posts