telugu navyamedia
సినిమా వార్తలు

“ఎఫ్-2” హిందీ రీమేక్… అధికారిక ప్రకటన 

a video song from f2 movie
ప్రముఖ దర్శకుఫు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ “ఎఫ్-2” చిత్రం బాక్స్ ఆఫీస్ బరిలో విజేతగా నిలిచి రికార్డులు క్రియేట్ చేసింది. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో “ఎఫ్-2” (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి మంచి ఆదరణ లభించింది. ఇక హీరోయిన్లుగా నటించిన తమన్నా, మెహ్రీన్ గ్లామర్ సినిమాకు ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఫుల్ లెంగ్త్ కామెడీతో నిర్మితమైన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నట్టు అఫీషియల్ ప్రకటన వెలువడింది. హిందీలో ఈ చిత్రాన్ని బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తుండగా, అనీష్ అజ్మీ దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. హిందీ రీమేక్ లో నటీనటులు, ఇతర టెక్నిషియన్లు తదితర విషయాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. మరి ఈ చిత్రానికి హిందీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Related posts