telugu navyamedia
సినిమా వార్తలు

కొబ్బరి మట్ట : ఆండ్రాయిడ్ సాంగ్ టీజర్

Kobbari-Matta

“హృదయ కాలేయం”, “సింగం 123” తర్వాత కొన్ని చిత్రాల‌లో స‌పోర్టింగ్ రోల్స్ చేసిన సంపూ ఇప్పుడు “కొబ్బరి మ‌ట్ట” చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మయ్యాడు. బ‌ర్నింగ్ స్టార్ గా అభిమానుల‌చే పిల‌వ‌బడుచున్న సంపూ 2015లో “కొబ్బ‌రి మ‌ట్ట” అనే చిత్రం మొద‌లు పెట్టాడు. ఈ చిత్రం ఎట్ట‌కేల‌కి ఆగ‌స్ట్ 10న విడుద‌ల‌య్యేందుకు సిద్ద‌మైంది. ఈ చిత్రానికి రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పెదరాయుడు, ఆండ్రాయుడ్, పాపారాయిడు ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించి సందడి చేయనున్నాడు సంపూ. ఈ సినిమా కూడా ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని టీం చెబుతుంది. ఈ క్ర‌మంలో చిత్ర ప్ర‌మోష‌న్స్ స్పీడ్ పెంచారు. ఇటీవ‌ల అ..ఆ , ఇ..ఈ అంటూ సాగే పాట‌కి సంబంధించిన ప్రోమో విడుద‌ల చేశారు. ఈ పాట మొత్తం తెలుగు అక్ష‌ర‌మాల‌తోనే ఉండ‌గా ఇందులో సంపూర్ణేష్ స్టెప్స్ అభిమానులను ఎంటర్టైన్ చేశాడు. చిత్రం నుండి ఇటీవల విడుద‌లైన డైలాగ్ టీజ‌ర్ కూడా అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇక ఈ రోజు ఆండ్రాయుడ్ సాంగ్ టీజర్ ను విడుద‌ల చేశారు చిత్రబృందం. ఈ పాటలో కూడా సంపూ త‌న స్టెప్పుల‌తో దుమ్మురేప‌నున్నాడని తెలుస్తోంది. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

Related posts