telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ కరోనా అప్డేట్… ఈరోజు ఎన్నంటే..?

corona

ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ, తగ్గుతూ ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూనే వున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 8.61 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. అందులో ఏపీలో కొత్తగా 1160 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,61,092 కి చేరింది. ఇందులో 8,39,395 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 14,770 కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో ఏడుగురు మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6927 కి చేరింది. అలానే జిల్లా వారీగా చూస్తే అనంతపూర్ లో 43, చిత్తూరులో 148, తూర్పు గోదావరిలో 165, గుంటూరులో 121, కడపలో 70, కృష్ణాలో 189, కర్నూలులో 23, నెల్లూరులో 60, ప్రకాశంలో 66, శ్రీకాకుళంలో 46, విశాఖపట్నంలో 67, విజయనగరంలో 42, పశ్చిమ గోదావరిలో 120 కరోనా కేసులు నమోదయ్యాయి.

Related posts