telugu navyamedia
telugu cinema news trending

“సమరం సమరం… విధితో సమరం”… కరోనాపై ఏపీ ప్రభుత్వం సాంగ్ వైరల్

Ap

కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో శ్రమిస్తున్నారు. ముఖ్యంగా కరోనాపై పోరులో డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ముందు వరుసలో నిలిచారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీరు కృషి చేస్తున్నారు. వీరిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతుండగా.. వారి కోసం ఏపీ ప్రభుత్వం ఓ పాటను రూపొందించి, అంకితం చేసింది. అందులో చైనా నుంచి వైరస్ రావడం, ప్రపంచమంతా విస్తరించడం, లాక్‌డౌన్ ప్రకటించడం ఇలా పలు విషయాలను చూపించారు. అలాగే కరోనాపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న పోరాటం, వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ ఘటన, వలస కార్మికులు పడుతున్న కష్టాల గురించి కూడా వీడియోలో చూపారు. ఈ పాటకు అనూప్ రూబెన్స్‌ సంగీతం అందించగా.. చందూ మొండేటి దర్శకత్వం వహించారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఈ పాటను నిర్మించారు. ఇక పాటలో పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు క్రీడా ప్రముఖులు భాగమయ్యారు. అందులో కాజల్ అగర్వాల్, పాయల్ రాజ్‌పుత్‌, సుధీర్ బాబు, నిధి అగర్వాల్, నిఖిల్, ప్రణీతా సుభాష్, పీవీ సింధు, ద్రోణవల్లి హారిక‌ ఉన్నారు. “సమరం సమరం.. విధితో సమరం” అంటూ సాగిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.

Related posts

భారీ వర్షాలకు గోదావరికి వరద ఉదృతి.. అధికారులను అప్రమత్తంగా ఉండాలన్న ఏపీసీఎం…

vimala p

సముద్రంలో కొడుకుకు స్విమ్మింగ్ పాఠాలు… వీడియో వైరల్

vimala p

ఆస్కార్ 2020 : ఉత్తమ సహాయనటిగా లారా డెర్న్

vimala p