telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీలో మారిన ఇసుక పాలసీ…

cm jagan

ఏపీ కేబినెట్ కొత్త ఇసుక పాలసీకి ఆమోదం తెలిపింది.  అన్ని రీచులను ఒకే సంస్థకు అప్పగించాలన్న సిఫార్సులకు ఆమోదం లభించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించాలని ముందు నిర్ణయం తీసుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏవీ అందుకు ముందుకు రాలేదు. దీంతో పేరుగాంచిన ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని కేబినెట్ సబ్‌కమిటీ సిఫార్సు చేసింది. ఓపెన్ టెండర్‌ ద్వారా ప్రక్రిట చేపట్టాలని కేబినెట్ సబ్‌కమిటీ  ర్ణయించింది. మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సులపై చర్చించి చివరకు ఏపీ కేబినెట్ ఆమోదించింది. దీంతో పాటు ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్‌ఈబీ బలోపేతంపై కేబినెట్‌లో చర్చ జరిగింది. ఎస్‌ఈబీ పరిధిని విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ సహా జూదాల కట్టడి బాధ్యతలను ఎస్‌ఈబీ పరిధిలోకి తేవాలని ఏపీ కేబినేట్ ప్రతిపాదించింది. ఇక నవంబర్ 24న జగనన్న తోడు పథకానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సున్నా వడ్డీ కింద 10 వేల రూపాయల రుణ సదుపాయం కల్పించనుంది. ఇక, ల్యాండ్ టైటిలింగ్ బిల్లు-2019లోని 75,76 క్లాజుల రద్దు సవరణకు నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినేట్. పులివెందుల మండలం కె.వి.పల్లి గ్రామం…ఆముదాల వలసలో క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు 11 ఎకరాల భూమి కేటాయించింది ఏపీ సర్కార్. అగ్నిమాపక సంస్థ బలోపేతానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండు నుంచి నాలుగు జోన్ల ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా వివిధ పోస్ట్‌లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Related posts