telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆంధ్రజ్యోతి’ లో “దొరికినా… దొరేనా?” అంటూ వార్త.. ఖండించిన ఏసీబీ డీజీ

acbdgg telangana

తప్పుడు కథనాలను ప్రచురించిన ఆంధ్రజ్యోతి దినపత్రికపై ఏసీబీ డీజీ పూర్ణచందర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి లో “దొరికినా… దొరేనా?”… “సీఎం కేసీఆర్‌ కు ఏసీబీ డీజీ సంచలన లేఖ” అంటూ వచ్చిన వార్తపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీ వెల్లడించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను సీఎస్ కు, సీఎంవోకు లేఖ రాశానని వచ్చిన వార్తలు అవాస్తవమని, ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తను చూసి చాలా బాధ కలిగిందని అన్నారు. రాయని లేఖను రాసినట్లుగా అసత్య వార్త రాసిన పత్రికపై చర్యలు తీసుకుంటామన్నారు.

నేను ఎలాంటి లేఖను ముఖ్యమంత్రికి, సీఎస్‌కు రాయలేదు. కానీ, రాసినట్లుగా వార్తను ప్రచురించారు. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వార్తలు రాస్తున్నారు. నేను రాయని లేఖలు రాసినట్లు ప్రచురించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మీడియా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందో ఏసీబీ కూడా అలానే పని చేస్తుందని చెప్పారు. మొత్తం వ్యవహారంపై యాజమాన్యం సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తప్పుడు వార్త విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related posts