telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్ షోలో కూడా కాస్టింగ్ కౌచ్ … షో నిషేధించాలి .. : యాంకర్ శ్వేతారెడ్డి

anchor swetareddy on bigg boss casting coach

టీవీ షో లలోకెల్లా బాప్ అని పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో ప్రసారం అవుతున్న సంగతి అందరికి తెలిసిందే… గత రెండు సంవత్సరాలుగా ఘన విజయం సాధించిన టీవీ షో ప్రస్తుతం వివాదాలకు దారీ తీస్తుంది. మొత్తం 100 రోజుల పాటు 16 మంది సభ్యులు ఒకే ఇంటిలో ఉండి వారి జీవితంలో జరిగిన విషయాలను సాధారణ ప్రజలుగా ఒకరికొకరు తెలుసుకుంటారు. బిగ్ బాస్ షోలో నటించిన వారు టాస్క్ ల ఆధారంగా ఎలిమినేట్ అవుతూ… చివరకు ఒక్కరే విజేతగా నిలుస్తారు. ప్రస్తుతం ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను సంపాదించుకున్న బిగ్ బాస్ సిరిస్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు వివాదాలకు దారి తీస్తుంది.

తాజా బిగ్ బాస్ పై యాంకర్ శ్వేతారెడ్డి సంచనల కామెంట్స్ చేసింది. ”బిగ్ బాస్ షోలో పాల్గొనాలంటే వాళ్ల బాస్ ని ఇంప్రెస్ చేయడం వలన ఉత్తరాది గబ్బు సంస్కృతిని తెలుగు వాళ్లపై రుద్దాలని అనుకుంటున్నారా..? బిగ్ బాస్ ని నిషేధించి తెలుగు టీవీ ప్రసారల నుండి వెలివేయాలి ఆమె తెలిపింది. అంతేకాదు బిగ్ బాస్ ముసుగులో నిర్వాహకులు బ్రోతల్ హౌస్ నడుపుతున్నారా..?” అంటూ యాంకర్ శ్వేతారెడ్డి మండిపడింది.

బిగ్ బాస్ షోలో కూడా కాస్టింగ్ కౌచ్ పాత్ర ఉందని ఆమె ఆరోపణలు చేసింది. బిగ్ బాస్ ముసుగులో నిర్వాహకులు చేస్తోన్న బాగోతాన్ని బయటపెట్టడానికి తాను మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ లో బిగ్ బాస్ షోకి సంబంధించిన ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి షో కోసం మిమ్మల్ని ఎంపిక చేశామని చెప్పి తనతో అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేయించుకున్నారని తెలిపింది.

బిగ్ బాస్ షోకు సంబందించిన అగ్రిమెంట్ కి జిరాక్స్ పేపర్లు తనకు ఇవ్వలేదని.. అదే సమయంలో ”మిమ్మల్ని షోలో ఎందుకు తీసుకోవాలి..? మా బాస్ ని ఎలా ఇంప్రెస్ చేస్తారని” షో ప్రొడ్యూసర్ శ్యామ్ తనను అడిగినట్లు తెలిపింది. అతడిని గట్టిగా నిలదీయడంతో తనను అవాయిడ్ చేశారని, ‘కమిట్మెంట్’ అడుగుతూ మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో కూడా చాలా మందితో ఇలానే ప్రవర్తించారని.. కొంతమంది బాధితులు తనకు ఫోన్ చేస్తున్నారని శ్వేతారెడ్డి తెలిపింది. ప్రస్తుతం కొంతమంది బాధితుల వివరాలను సేకరించే పనిలో ఉన్నానని… అవి తెలియగానే బహిర్గతం చేయగానే మిగిలిన బాధితులు బయటకి వస్తారని ఆమె తెలిపారు.

Related posts