telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వాటిని చూసి చాలా నేర్చుకోవాలి… సుమ సందేశం వైరల్

Suma

బుల్లితెర ప్రోగ్రామ్ అయినా.. వెండితెర సినిమా ఈవెంట్ అయినా సుమ వాక్చాతుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇదిలా ఉంటే ఆమె వ్యక్తిగత జీవితంపై గత కొంతకాలంగా ఎన్నో వార్తలు షికారు చేస్తున్నాయి. భర్త రాజీవ్ కనకాలతో ఆమెకు విభేదాలు తలెత్తాయని, ఆ ఇద్దరూ విడిగానే ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సుమ కనకాల షేర్ చేసిన వీడియో, దానిపై ఆమె రాసిన సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆహ్లాదకర వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య పరుగెడుతూ ఆ వీడియోలో కనిపించిన సుమ.. వాటిని చూసి చాలా నేర్చుకోవాలంటూ వేదాంతం వల్లించింది. ఈ ఆకుపచ్చ, ఎరుపు వర్ణాలు కంటికి అదేవిధంగా ఆత్మకు ప్రశాంతత ఇస్తున్నాయి. సంతోషం అనేది జీవితంలో నిరంతర ప్రక్రియ అని, అది ఏ ఒక్క సమయానికో పరిమితం కాదని పేర్కొంది సుమ.

Related posts