telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

షోస్ చేస్తున్నా.. ఆ అభిమానులను కలిసి.. : యాంకర్ శ్రీముఖి

srimukhi out from patas for anther show

తెలుగు రాష్ట్రాల్లో పటాస్ షో ద్వారా ఎంతో పాపులర్ అయిన యాంకర్ శ్రీముఖి తెలుగు రియాలిటీ షో ‘బిగ్ బాస్ 3’ సీజన్‌లో శ్రీముఖి పాల్గన్న విషయం తెలిసిందే. ఆ షోలో పాల్గొనడమే కాదు మూడవ సీజన్ రన్నరప్‌గా కూడా నిలిచింది. ఇక బిగ్ బాస్ హౌజ్‌లో మూడు నెలలకు పైగా తన అల్లరితో, టాస్క్‌లతో అదరగొట్టిన శ్రీముఖి ఆ షో ముగిసిన తర్వాత రిలాక్స్ అవ్వడానికి విదేశాలకు వెళ్లింది. ఆ వెకేషన్‌ను ఇటీవలే పూర్తి చేసుకుని షూటింగ్‌లో మళ్లీ బిజీ అయ్యింది శ్రీముఖి. ఇక తన సోషల్ మీడియా వేదికగా ఈ సందర్భంగా ఓ వీడియోను పోస్ట్ చేసి తన అభిమానులకు గుడ్ న్యూస్‌ చెప్పింది. ఆమె మాట్లాడుతూ.. మళ్లి తెరపై అతి త్వరలోనే కనిపిస్తానని, అందులో భాగంగా ఆరోగ్యం సరిగా లేకున్నా స్టార్ మాలో అదిరిపోయే ప్రోగ్రామ్ షూటింగ్‌లో పాల్గొంటున్నాని పేర్కోంది.

శ్రీముఖి బిగ్ బాస్ హౌస్‌లో తన 105 రోజుల ప్రయాణంలో ఎంతగానో సహకరించిన అభిమానుల కోసం ఆమె కొత్తగా ఓ నిర్ణయం తీసుకుంది. అదేమంటే బిగ్ బాస్ హౌస్‌లో తనకు చివరి వరకు అండగా నిలిచిన అభిమానులను కలవాలని నిర్ణయించుకుందట.. ఇందుకు గాను ఆమె త్వరలోనే ఓ ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేయబోతోందట. ఆ ప్రోగ్రామ్ ఎలా ఉండాలి, ఫ్యాన్స్‌ను ఎప్పుడు కలవాలి అనే దానిపై శ్రీముఖి టీమ్ కసరత్తు కూడా చేస్తోందట. దీనిపై మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ రానుందని. ఆ తర్వాత దీనికి సంబంధించిన వివరాలను తన ఫ్యాన్స్‌ కోసం సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేయనున్నామని తెలిపారు.

Related posts