telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : ఇప్పుడు రాహుల్ లక్షాధికారి… కానీ శ్రీముఖి కోటీశ్వరురాలు…!

telugu bigg boss 3 srimukhi and rahul

బాస్ విన్నర్‌ అయిన రాహుల్ సిప్లిగంజ్‌కి వచ్చింది రూ. 50 లక్షలు అయితే.. వాటిలో టాక్స్‌‌లు మినహాయించి చేతికి వచ్చేది కేవలం రూ. 36-37 లక్షలు మాత్రమే. అయితే అతని రెమ్యూనరేషన్ అన్నీ కలుపుకుని సుమారుగా రాహుల్‌ చేతికి అందేది రూ. 50 లక్షలు మాత్రమే. ‘శ్రీముఖి ఇప్పటికే బాగా సంపాదించింది.. ఒకవేళ బిగ్ బాస్ విన్నర్ అయినా ఆమెకు ఇచ్చే రూ. 50 లక్షలు పెద్ద లెక్క కాదు. అదే రాహుల్‌కి ఆ రూ. 50 లక్షలు ఇస్తే.. వాడి లైఫ్ సెటిల్.. అందుకే అతనికి సపోర్ట్ చేయండి’ అని.. రాహుల్ స్నేహితుడు ర్యాప్ సింగర్ నోయల్ ఇటీవల కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకున్న శ్రీముఖి.. రెమ్యూనరేషన్ విషయంలో రాహుల్‌కి అందనంత దూరంలో ఉంది. బిగ్ బాస్ షో ప్రారంభకావడానికి ఒక నెల ముందుగానే పటాస్ షో లాంటి షోలను వదిలేసిన శ్రీముఖి భారీగానే రెమ్యూనరేషన్ అందుకుందట. 100 రోజులకు గానూ శ్రీముఖికి 3.5 కోట్లు అందుకున్నట్టు సమాచారం. ఆమెకు స్పాన్సర్ షిప్‌లు కూడా దండిగా ఉండటంతో శ్రీముఖి బిగ్ బాస్ షో‌ రెమ్యూనరేషన్‌తో కోటీశ్వరురాలైనట్టు బోగట్ట. విన్నర్ అయిన రాహుల్ రూ. 50 లక్షలతో లక్షాధికారి అయితే.. శ్రీముఖి రన్నరప్ అయినా బిగ్ బాస్ ఇంటి నుండి కోట్లు తీసుకుని వెళ్లినట్టు సమాచారం. అయితే శ్రీముఖి పాటు భార్యతో కలిసి జంటగా వచ్చిన వరుణ్ సందేశ్-వితికాలకు గట్టిగానే ముట్టినట్టు తెలుస్తోంది. కపుల్ ప్యాకేజ్ కింద ఈ ఇద్దరికీ కోటి ముట్టినట్టు తెలుస్తోంది. ఫైనల్‌కి చేరిన టాప్ 5 కంటెస్టెంట్స్‌లో లీస్ట్‌లో అలీ రెజానేనట. మరి హోస్ట్ నాగార్జునకు రెమ్యూనరేషన్ ఎంతంటే.. రూ. 5 కోట్ల పైమాటేనట. వారంలో రెండే రోజులు హోస్ట్ చేసినా నాగార్జునకు ఈ సీజన్‌లో గట్టిగానే ముట్టినట్టు తెలుస్తోంది. సీజన్ 1, సీజన్ 2లలో హోస్టింగ్ చేసిన ఎన్టీఆర్, నానిలకంటే నాగార్జునే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్నారట.

Related posts