telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రీముఖి ఇంట పెళ్లి బాజాలు…!

Srimukhi

ఎనర్జిటిక్‌కి కేరాఫ్ అడ్రస్ ఎవరంటే అందులో శ్రీముఖీ కూడా ఉంటుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది. టాలీవుడ్‌‌లో ఉన్న ప్రముఖ యాంకర్లలో శ్రీముఖి కూడా ఉంటుంది. కేవలం బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా కనువిందు చేసింది. ఇక ఆ తరువాత బిగ్‌బాస్ సీజన్-3లో కూడా చివరివరకూ కొనసాగుతూ.. టైటిల్ విన్నర్ అవుతుందని అందరూ ఆశించినా.. అందుకు భిన్నంగా.. రన్నరప్‌గా మాత్రమే నిలిచింది. ఇక బిగ్‌బాస్ తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకున్నా.. వెంటనే స్టార్‌ మా ఛానెల్‌లోని ‘స్టార్ మ్యూజిక్‌’ షోతో కనువిందు చేస్తోంది. తాజాగా.. శ్రీముఖి ఇంట పెళ్లిభాజాలు మోగాయి. సోషల్ మీడియాలో దానికి సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవడంతో.. అందరూ శ్రీముఖికి పెళ్లి అవుతుందేమో అనుకుంటున్నారు. ఆమె ఇంట్లో పెళ్లి భాజాలు మోగిన మాట నిజమే కానీ… అది తనది కాదు.. వాళ్ల చెల్లిది. అయినా శ్రీముఖి పెళ్లి ఫిక్స్‌ అయితే ఇంత సైలెంట్ గ ఉంటుందా ?

Related posts