telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అనారోగ్యంతో బాధపడుతున్న యాంకర్ ప్రదీప్… నిజం బయటపెట్టిన రవి

ravi

బుల్లితెరపై యాంకర్ గా సత్తా చాటుతున్న ప్రదీప్ ఉన్నట్లుండి మూడేళ్లుగా చేస్తున్న ఢీ జోడీ నుంచి కూడా తప్పుకున్నాడు. దాంతో అభిమానులు షాక్ అయ్యారు. ఈయన రెమ్యునరేషన్ ఎక్కువగా అడగడం వల్లే తప్పించారనే ప్రచారం కూడా జరిగింది. అందుకే ఆయన్ని కాదని.. రవిని రంగంలోకి దించారనే వార్తలు కొన్ని రోజులుగా వస్తున్నాయి. అయితే అసలు కారణం అది కాదని ఇప్పుడు తెలిసింది. తానెందుకు ఢీ జోడీలోకి ఎంట్రీ ఇచ్చానో స్వయంగా రవి చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ప్రదీప్ ఈ షో నుంచి తప్పుకోడానికి కారణం పారితోషికమో.. లేదంటే కామెడీ రాకపోవడమో కాదు ఆయనకు అనారోగ్యం అని ఇప్పుడు బయటపడిన నిజం. ఈ మధ్యే అక్టోబర్ 23న ప్రదీప్ తన పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా యాంకర్స్ అంతా కలిసి పార్టీ కూడా చేసుకున్నారని తెలుస్తుంది. ప్రదీప్ పుట్టినరోజు నాడు అతడితో మాట్లాడానని ఓ వీడియో చేసాడు రవి. అంతేకాదు.. అతడు రివకర్ అవుతున్నాడు.. త్వరలోనే మళ్లీ బుల్లితెరపై రీ ఎంట్రీ ఇస్తాడు.. బ్యాంగ్ బ్యాంగ్ అంటున్నాడు రవి. దీన్నిబట్టి చూస్తుంటే ప్రదీప్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధ పడుతున్నాడని అర్థమవుతుంది. అయితే అదేంటి అనేది మాత్రం తెలియడం లేదు. అందుకే కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా సీజన్ 4కు కూడా కొన్ని రోజులు బ్రేక్ పడుతుందని తెలుస్తుంది. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ ఈయన స్మాల్ స్క్రీన్‌పై రచ్చ చేయడానికి రెడీ అవుతున్నాడు.

Related posts