telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యాంకర్ రవి కారు యాక్సిడెంట్… పరారైన డ్రైవర్

Ravi

ప్ర‌ముఖ యాంక‌ర్ ర‌వి కారు ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్ర‌మాదంలో ఆయ‌నకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే కారు మాత్రం డ్యామేజ్ అయ్యింది. శనివారం మూసాపేట నుండి బంజారాహిల్స్ వైపు వ‌స్తున్న రవి కారుని భ‌ర‌త్ న‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్ ద‌గ్గ‌ర ఓ డీసీఎం ఢీ కొట్టింది. ఈ విష‌యంపై ర‌వి త‌న యూ ట్యూబ్ ఛానెల్‌లో వివ‌ర‌ణ ఇచ్చారు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన డీసీఎం డ్రైవ‌ర్‌ను, క్లీన‌ర్‌ను ప‌ట్టుకుని ప్ర‌శ్నించే ప్ర‌య‌త్నం చేసిన‌ప్పుడు వారు మ‌ద్యం తాగి ఉన్నార‌ని , తాను పోలీసుల‌కు ఫోన్ చేసి కంప్లైంట్ చేశానన్నారు. పోలీసులు వ‌చ్చే లోపు స‌ద‌రు డ్రైవ‌ర్‌, క్లీన‌ర్ పారిపోయార‌ని, ఇలా మ‌ద్యం తాగి వాహ‌నాలు న‌డిపితే ప్ర‌మాదాలు జ‌రుగుతాయ‌ని ర‌వి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. స‌న‌త్‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో డ్రైవ‌ర్‌తో పాటు ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ ఓన‌ర్‌పై కూడా కేసు వేశానని ర‌వి తెలిపారు.

Related posts