telugu navyamedia
సినిమా వార్తలు

మనుషులు చూపిస్తున్న నిరాదరణ కలచి వేసింది : రష్మీ

Rashmi

ప్రముఖ హాట్ యాంకర్ రష్మీ ఒకవైపు యాంకరింగ్ చేస్తూ… అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తూ బిజీగా గడుపుతోంది. రష్మీ ఎప్పుడూ సోషల్ మీడియాలో అప్డేట్ గా ఉంటూ అభిమానులతో తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా రష్మీ షూటింగ్ కోసం ఒక స్టూడియోకు వెళ్లగా… బయట ఒక కుక్కపిల్లను చూసిందట. ఆ కుక్కపిల్లకు గాయమైందట. ”ఈ పప్పీకి వైద్య సాయం కావాలి. నేను షూటింగ్ చేస్తున్న స్టూడియో బయట దీనిని నేను చూశాను. జంతువుల పట్ల మనుషులు చూపిస్తున్న నిరాదారణ నన్ను కలచివేసింది. దయచేసి సాయం చేయండి” అంటూ ట్వీట్ చేసింది. మరికాసేపటికే దానికి తీవ్ర గాయమైనట్టుగా కన్పిస్తోందని, ఆ పప్పీని తాను హాస్పిటల్ కు తీసుకెళ్తున్నానని, వైద్యంతో పప్పీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ రెస్క్యూ హోమ్ నంబర్స్ ఉంటే తెలియజేయాలంటూ తన అభిమానులను కోరింది రష్మీ. ఈ విధంగా రష్మీ తన సామాజిక బాధ్యతను నిర్వహించిందన్న మాట. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Related posts