telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బడా రాజకీయ నాయకుడి కూతురితో యాంకర్ ప్రదీప్ పెళ్ళి ?

Pradeep

లాక్‌డౌన్ సమయంలో ఇండస్ట్రీలో వరుసపెట్టి హీరోలు పెళ్ళిపీటలెక్కారు. ఇప్పటికే నిఖిల్, నితిన్, రానా లాంటి యంగ్ హీరోలతో పాటు పలువురు టీవీ ఆర్టిస్టులు కూడా పెళ్లి చేసుకోగా.. తాజాగా యాంకర్ ప్రదీప్ పెళ్లి మ్యాటర్ టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. బుల్లితెరపై యాంకర్‌గా ప్రదీప్ మాచిరాజుకు ఫుల్ క్రేజ్ ఉంది. ఎంతోమంది మేల్ యాంకర్స్ ఉన్నా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతున్నాడు. ఇకపోతే వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రదీప్.. ఇప్పటికే ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాను కంప్లీట్ చేశాడు. మున్నా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రదీప్‌ సరసన అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా నటించింది. అతిత్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక 33 ఏళ్ళ ఈ కుర్ర యాంకర్ ఇప్పుడు నిజంగానే పెళ్లికి సిద్ధమయ్యాడని, ప్రదీప్ మరో రెండు మూడు నెలల్లోనే పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. ఓ బడా రాజకీయ నాయకుడి కుమార్తెతో ప్రదీప్ మ్యారేజ్ ఫిక్స్ అయిందని, కాకపోతే దాన్ని సీక్రెట్ గానే ఉంచారని అంటున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబం పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉందని టాక్. చూడాలి దీనిపై ప్రదీప్ ఎలా రియాక్ట్ అవుతాడనేది. ఇక ఇప్పటికే యంగ్ యాంకర్స్ రష్మీ గౌతమ్, శ్రీముఖి మూడుముళ్ళ బంధానికి రెడీ అయ్యారని తెలుస్తుండటం కూడా హాట్ టాపిక్ అయ్యింది.

Related posts