telugu navyamedia
సినిమా వార్తలు

“బిగ్ బాస్-3″లో యాంకర్ లాస్య ?

Lasya

రియాలిటీ షో బిగ్ బాస్.. రెండు సీజన్స్‌లోను బుల్లితెరపై సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ “షో”కి తెలుగులో తొలి సీజన్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించగా.. రెండో సీజన్‌కి నాని హోస్ట్‌గా ఉన్నాడు. అయితే ఇక సీజన్ 3 ఎప్పుడు మొదలవుతుంది ? దానికి హోస్ట్ ఎవరు అనే దానిపై కొన్నాళ్ళుగా హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. మీలో కోటీశ్వరుడు వంటి రియాలిటీ షోతో ఆకట్టుకున్న నాగార్జుననే బిగ్ బాస్ 3ని హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇటీవల వరుస ప్రోమోలతో “బిగ్ బాస్-3” సందడి మొదలైపోయింది. ప‌లు ప్రోమోల‌తో స్టార్ మా అంచనాలు పెంచుతుంది. ఇక ఇందులో కంటెస్టెంట్స్‌గా ఎవ‌రు ? అనే విషయమై హాట్ గ చర్చ నడుస్తోంది. జూలైలో ప్రారంభం కానున్న ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరేనంటూ పలువురు యాంక‌ర్స్‌, రాజకీయ నాయ‌కులు, న‌టులు, క్రీడా ప్ర‌ముఖుల పేర్లు విన్పిస్తున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం గత కొంతకాలం క్రితం బుల్లితెర‌పై సందడి చేసిన యాంకర్ లాస్య “బిగ్ బాస్-3″లో పాల్గొన‌బోతుంద‌ని తెలుస్తోంది. ఇటీవ‌లే ఒక బిడ్డకు జన్మనిచ్చిన ఈ అమ్మ‌డు మ‌ళ్ళీ బిగ్ బాస్ కార్య‌క్ర‌మంతో మళ్ళీ క్రేజ్ అందుకుంటుందేమో చూడాలి. ఇక ఈ విషయంపై స్పష్టత రావాలంటే బిగ్ బాస్ మొదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Related posts