telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్ ఎంట్రీ లాస్య కామెంట్స్… 30 లక్షలు ఇచ్చారు… ఈ సమయం మళ్ళీ రాదు

Lasya

రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 త్వరలోనే మొదలు కాబోతోంది. మీలో ఎవరు కోటీశ్వరుడు వంటి రియాలిటీ షోతో ఆకట్టుకున్న నాగార్జుననే బిగ్ బాస్ 3ని హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇటీవల వరుస ప్రోమోలతో “బిగ్ బాస్-3” సందడి మొదలైపోయింది. ప‌లు ప్రోమోల‌తో స్టార్ మా అంచనాలు పెంచుతుంది. ఇక ఇందులో కంటెస్టెంట్స్‌గా ఎవ‌రు ? అనే విషయమై చర్చ నడుస్తోంది. జూలైలో ప్రారంభం కానున్న ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరేనంటూ పలువురు యాంక‌ర్స్‌, రాజకీయ నాయ‌కులు, న‌టులు, క్రీడా ప్ర‌ముఖుల పేర్లు విన్పిస్తున్నాయి. అందులో భాగంగానే గత కొంతకాలం క్రితం బుల్లితెర‌పై సందడి చేసిన యాంకర్ లాస్య “బిగ్ బాస్-3″లో పాల్గొన‌బోతుంద‌ని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. తాజాగా లాస్య ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.

ఆమె ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి కంగ్రాంట్స్ చెబుతున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో లాస్య బిగ్ బాస్ ఎంట్రీపై వివ‌ర‌ణ ఇచ్చింది . ”మీకో.. విషయం తెలుసా.. నేను బిగ్ బాస్ కి వచ్చేస్తున్నాను. షో స్టార్ట్ కాక‌ముందే బిగ్ బాస్ వాళ్లు లాస్య‌కి 30 ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ ఇచ్చారు. బిగ్ బాస్ లో లాస్య కన్ఫర్మ్ అయిపోయింది. అబ్బా ఇది వినడానికి ఎంత బాగుందో.. కానీ ఇదంతా అబద్దం.. నాకు ప్రస్తుతం రెండున్నర నెలల చిన్న బాబు ఉన్నాడు. బాబుతోనే టైం సరిపోతోంది. నాకు ఇలాంటి సమయం మళ్ళీ రాదు. ఈ ఏడాది పూర్తిగా బాబుతోనే గడపాలనుకుంటున్నాను. వీలైతే బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ లో కనిపించే అవకాశం ఉంది.” అంటూ చెప్పుకొచ్చింది.

Related posts