telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బిగ్ బాస్”లో మహిళా వివక్ష… యాంకర్ ఝాన్సీ ఫైర్

Jhansi

105 రోజుల బిగ్ బాస్ నాగార్జున హోస్ట్‌గా 17 మంది కంటెస్టెంట్స్‌తో జూలై 21 ప్రారంభమైన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌ సీజన్ 3‌లో టైటిల్‌ను సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ గెలుచుకున్నారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ రూ.50లక్షల నగదు బహుమతిని దానితో పాటు ఓ ట్రోఫీని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌కు విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్‌కు మెగాస్టార్ చిరు టైటిల్‌ను అందజేశారు. ఇక విన్నర్ అవుతుందని భావించిన శ్రీముఖి మాత్రం రన్నర్ తో సరిపెట్టుకుంది. ఆమెకున్న ఇమేజ్ కారణంగా బిగ్ బాస్ సీజన్ 3 విజేత ఆమెనే అని అంతా అనుకున్నారు. కానీ ఫైనల్‌గా రాహుల్ టైటిల్‌ను ఎగరేసుకుపోయి… శ్రీముఖిని రెండో స్థానానికి పరిమితం చేశారు. శ్రీముఖికి టైటిల్ దక్కకపోవడం పట్ల ఆమె అభిమానులు ఇప్పటికే తీవ్ర అసహనంతో ఉన్నారు. తాజాగా ఈ కోవలో యాంకర్ ఝాన్సీ కూడా చేరారు. శ్రీముఖికి బిగ్ బాస్ టైటిల్ దక్కకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకా, దీనిలోని స్త్రీ వివక్షను తీసుకొచ్చారు. తాజాగా ఝాన్సీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘అమెరికా లాంటి దేశమే మహిళా అధ్యక్షురాలికి సిద్ధంగా లేనప్పుడు.. తెలుగు ప్రేక్షకులు మహిళా బిగ్ బాస్ విన్నర్‌కి ఏం సిద్ధంగా ఉంటారు’’ అని ఆ పోస్ట్‌లో ఝాన్సీ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేసిన హిల్లరీ క్లింటన్.. ట్రంప్‌ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. అసలు బిగ్ బాస్‌లో శ్రీముఖి ఓడిపోవడానికి, మహిళా వివక్షకు సంబంధం ఏముందని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. శ్రీముఖి ప్రముఖ యాంకర్ కాబట్టి ఆమెను సహచర యాంకర్‌గా ఝాన్సీ సపోర్ట్ చేస్తున్నారని, ఝాన్సీ ఫేక్ ఫెమినిస్ట్ అని నిందలు కూడా వేస్తున్నారు. అయితే శ్రీముఖి అభిమానులు మాత్రం ఝాన్సీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

Related posts