telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనా వైరస్ కాదు… కార్పొరేట్ మోసం… యాంకర్ షాకింగ్ కామెంట్స్

Swetha

ప్రపంచం కరోనా వైరస్ ను చూసి వణికిపోతోంది. తెలంగాణలో ఇప్పటికే ఒక కేసును కనుగొన్నారు. ఇప్పటి వరకు భారత్‌లో దాదాపు 30 కేసులు కనుగొన్నారట. అయితే ఈ కరోనా అనేది కార్పొరేట్ మోసం అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసారు యాంకర్, బీజేపీ నేత శ్వేతారెడ్డి. “ఎక్కడ చూసినా కరోనా కరోనా అనే మాట తప్ప ఇంకేమీ వినబడటంలేదు. అన్ని టీవీ ఛానెల్స్‌లో ఇదే చూపిస్తు్న్నారు. అయితే బుర్ర ఉన్న ఎవరైనా కాస్త సుదీర్ఘంగా ఆలోచించినట్లైతే కరోనా అనేది కార్పొరేట్ మోసం అన్న విషయం చాలా క్లియర్‌గా అర్థమవుతోంది. అంటే ఫార్మాసూటికల్ కంపెనీలు తమ వద్ద ఉన్న మందులను అమ్మి సొమ్ము చేసుకోవడం కోసం వారే ఈ కరోనాను వ్యాపింపజేసి, ఆ తర్వాత వారి మందులనే ప్రజలు అధిక రేట్లకు కొనుక్కునేలా చేస్తున్నారని నేను కచ్చితంగా చెప్పగలను. అంటే మనకు కరోనా ద్వారా ‘ధ్రువ’, ‘రాజుగారి గది’ లాంటి సినిమాలను చూపిస్తున్నారు. సమాజంలో జరుగుతున్నవాటినే సినిమాల్లో చూపిస్తారు అనడానికి ఇదే నిదర్శనం. కరోనా పేరుతో ప్రపంచాన్ని హడలుగొట్టేసి ఆ తర్వాత ఏ అమెరికానో మరే దేశమో ఆల్రెడీ తయారుచేసిన మందును చూపించి ఇప్పుడే మందు కనిపెట్టేసాం అని చెప్పి ఉన్న రేటు కంటే వెయ్యి రెట్లు ఎక్కువకు అమ్మి సొమ్ముచేసుకోవాలని అనుకుంటున్నారు. ప్రపంచపటంలో భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు మోదీగారు ప్రయత్నిస్తున్న తరుణంలో దానిని చూసి ఓర్వలేక ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని క్లియర్‌గా అర్థమవుతోంది. అయోధ్య కేసు, ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 వంటి కేసులను ఇట్టే తీర్చేసిన మోదీ.. సరిగ్గా సీఏఏ, ఎన్నార్సీ విషయంపై శ్రద్ధ పెడుతున్న సమయంలో కరోనా వ్యాపించడం ఏంటో నాకు అర్థంకావడంలేదు. ఈ వైరస్ వల్ల హోలీ వేడుకలు వద్దని అనుకున్నారు. ఇతర ప్రదేశాల్లో జరగాల్సిన సమావేశాలను వాయిదా వేసుకున్నారు. నేను మాత్రమే కాదు పార్లమెంట్‌లో జరుగుతున్న సమావేశాల్లో కూడా ఇదే చర్చ వినిపించింది. చాలా మంది అడ్వకేట్లు, పెద్ద పెద్ద నేతలు కూడా కరోనా ఓ కార్పొరేట్ మోసంలా అనిపిస్తోందని సందేహం వ్యక్తం చేసారు’’ అని వెల్లడించారు శ్వేతా.

Related posts