telugu navyamedia
telugu cinema news

“ఎఫ్-2″లో గెస్ట్ గా అనసూయ

Anasuya

దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ సినిమా రూపొందుతోంది. వెంకటేశ్, వరుణ్ తేజ్ కథానాయకులుగా చేస్తోన్న ఈ సినిమాలో వెంకటేశ్ సరసన తమన్నా… వరుణ్ తేజ్ జోడిగా మెహ్రీన్ నటిస్తోన్న ఈ సినిమా, నాన్ స్టాప్ నవ్వులతో కొనసాగుతుందని చెబుతున్నారు. చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. ఒక్క ఫైట్ సీన్ కూడా లేకుండా సినిమాను తెరకెక్కించారట. ఇక ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో అనసూయ మెరవనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అనసూయ స్పెషల్ సాంగ్ మాత్రమే కాదు సినిమాలోని ఓ కీలకమైన పాత్రలో మెరవనుందని సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

అనసూయ గతంలో పాత్రతో ముడిపడిన స్పెషల్ సాంగ్స్ కు మాత్రమే ప్రాముఖ్యతనిస్తానని చెప్పింది. ఈ సినిమాలో తనకు మంచి రోల్ ఉండడంతోనే స్పెషల్ సాంగ్ కూడా చేయడానికి అంగీకరించిందట. ఇక ఈ పాటలో వెంకటేశ్, వరుణ్ తేజ్ లతో పాటు అనసూయ స్టెప్పులు వేయనుంది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేస్తుందని అంటున్నారు. అనిల్ రావిపూడి వరుస హిట్లు కొడుతుండటంతో, ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts

బాలీవుడ్ భామ పాత్రను కొట్టేసిన శ్రియ

vimala p

ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్న సీనియర్ నటుడు

vimala p

పవన్ ను మహేష్ తో పోల్చిన నాగబాబు

vimala p