telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ పాత్రలో చేయడం లేదు….

Anasuya

బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ఒకవైపు బుల్లితెరపై, మరోవైపు వెండితెరపై మంచి అవకాశాలతో దూసుకెళ్తోంది. తన గ్లామర్ తో యూత్ లో మంచి క్రేజ్ ను దక్కించుకుంది ఈ బ్యూటీ. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌తో మూడు నెలలపాటు ఖాళీగా ఇంట్లోనే ఉన్న అనసూయ.. మళ్లీ ఇప్పుడు ‘జబర్దస్త్’, ‘ప్రతిరోజూ పండగే’ షోలతో బిజీగా ఉన్నారు. కాగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది. ఆ సినిమాలో రంగమ్మత్తగా అదరగొడుతూ ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది.తాజాగా ఈ అందాల యాంకర్ కు అదిరిపోయే ఆఫర్ వచ్చిందట. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం “రంగమార్తాండ” అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే…తాజాగా అనసూయపై ఓ వార్త వైరల్‌ అయింది. విజయ్‌ సేతుపతి హీరోగా చేస్తున్న సినిమాలో అనసూయ నటిస్తుందని.. అందులో సిల్క్‌ స్మితా పాత్రలో చేస్తుందని వార్తలు వచ్చాయి. అయితే…. దీనిపై స్వయంగా అనసూయ ట్విట్టర్‌ వేదికగా స్పందించింది. తాను సిల్క్‌ స్మితా పాత్ర చేయడం లేదని క్లారిటీ ఇచ్చేసింది. ఆ వార్తలన్నీ జస్ట్‌ రూమర్స్‌ అని తేల్చేసింది అనసూయ.

Related posts