telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

జబర్దస్త్ పై .. అనసూయ ఆవేశం..

Anasuya-bharadwaj tollywood

గత కొన్ని రోజులుగా బుల్లితెరపై జబర్దస్త్ రచ్చ కొనసాగుతూనే ఉంది. ఉన్నట్టుండి అకస్మాత్తుగా జబర్దస్త్ నుంచి జడ్జిగా ఉన్న మెగా బ్రదర్ నాగబాబు తో పాటు చమ్మక్ చంద్ర కిరాక్ ఆర్టీ లాంటి బాగా ఫేమస్ అయిన టీం లీడర్స్ కూడా జబర్దస్త్ ని వదిలి వెళ్ళడం బుల్లితెర వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. జబర్దస్త్ స్టార్ట్ అయినప్పుడు నుంచి కొనసాగుతున్న జబర్దస్త్ నాగబాబు జబర్దస్త్ టీమ్ లీడర్స్ కూడా ఇప్పటికే జీతెలుగు లో ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. జబర్దస్త్ టీం లీడర్ లైన చమ్మక్ చంద్ర కిరాక్ ఆర్పి లు కూడా జి తెలుగులో ప్రసారమయ్యే ప్రోగ్రామ్ లో తమ కామెడీ స్టార్ట్ చేశారు. వీరందరూ జబర్దస్త్ నుండి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది కూడా. అయితే జబర్దస్త్ కు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉన్న అనసూయ భరద్వాజ్ కూడా కొన్ని రోజుల్లో జబర్దస్త్ నుండి తప్పుకుంటుంది అంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తనదైన యాంకరింగ్ తో రక్తికట్టించి జబర్దస్త్ ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ భరద్వాజ్… ఇంకొన్ని రోజుల్లో జబర్దస్త్లో కనిపించదు అంటూ వార్తలు వస్తున్నాయి. జీ తెలుగు లో ప్రసారమయ్యే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి ప్రోగ్రాం లో కానీ లోకల్ గ్యాంగ్ ప్రోగ్రాంలో కానీ అనసూయ భరద్వాజ్ జబర్దస్త్కు మించిన పర్ఫామెన్స్ లతో దుమ్మురేపుతోంది.

జబర్దస్త్ లో తన యాంకరింగ్ తోనే అదరగొడుతే జీ తెలుగు లో ప్రసారం కాబోతున్న షోలకు సంబంధించి విడుదల చేసిన ప్రోమోలలో అదిరిపోయే స్టెప్పులతో అందరినీ మైమరిపిస్తూ తన నవ్వులతో అందరి మతి పోగొడుతుంది అనసూయ భరద్వాజ్. ఈ క్రమంలో అనసూయ భరద్వాజ్ జీ తెలుగు లో ప్రసారమయ్యే ప్రోమోలలో కనిపించటం కూడా అనసూయ జబర్దస్త్ మానేస్తుంది అనే వార్తలకు బలం చేకూరుస్తుంది. ఈ నేపథ్యంలో జబర్దస్త్ ప్రేక్షకులందరూ అయోమయంలో పడ్డారు. ఇప్పటికే జబర్దస్త్ నుండి జడ్జ్ నాగబాబు… చమ్మక్ చంద్ర కిరాక్ ఆర్పీ టీం లీడర్లు కూడా జబర్దస్త్ నుండి తప్పుకోగా… ప్రస్తుతం జబర్దస్త్ లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉన్న అనసూయ కూడా జబర్దస్త్ వదిలి పోతే జబర్దస్త్ పరిస్థితి ఏంటని జబర్దస్త్ ప్రేక్షకులందరూ అయోమయంలో పడ్డారు. గత కొన్ని రోజులుగా అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ వదిలి వెళ్ళిపోతుంది అంటూ వివిధ రకాల కారణాలతో వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలను పై అనసూయ ఘాటు సమాధానం చెప్పింది. ఆ దేవుని దయవల్ల నేను జబర్దస్త్ అనసూయ గా చాలా బాగున్నాను. జబర్దస్త్ నుండి వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై త్వరలో క్లారిటీ ఇస్తాను… దయచేసి నా నుండి వచ్చే సున్నితమైన సమాధానాలను కోల్పోవద్దు. నేను ఇచ్చే సమాధానాలు వాళ్లని శాంత పరుస్తుంది. నేను ఎవరి నుంచి మాట్లాడుతున్నాను వాళ్లకి క్లియర్ గా తెలుసు… స్టాప్ జాబ్ లెస్ న్యూస్, గెట్ ఏ లైఫ్ అంటూ ఘాటుగా స్పందించింది అనసూయ భరద్వాజ్. ఇప్పటికే జబర్దస్త్ షోలో కొత్త కమెడియన్స్ తో ప్రోమో విడుదల చేసిన విషయం తెలిసిందే. జబర్దస్త్ ఫ్యామిలీ మెంబర్స్ అందర్నీ స్టేజ్ మీదకు తీసుకువచ్చి కామెడీ చేస్తూ ప్రోమో విడుదల చేసింది మల్లెమాల యాజమాన్యం.

Related posts