telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మహారాష్ట్రపై .. కబడ్డీ కామెంట్ చేసిన .. ఆనంద్ మహీంద్రా

anand mahindra on maharastra politics

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తాజా మహారాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. గతంలో ఆయన షేర్‌ చేసిన ఓ వీడియోను రీట్వీట్ చేస్తూ.. దాన్ని మరాఠా రాజకీయాలతో పోల్చే ప్రయత్నం చేశారు. ‘ప్రస్తుతం మహారాష్ట్రలో జరిగిన పరిణామాలకు ఇంతకంటే బాగా వివరించగలమా..?’ అని తన అభిమానుల్ని ప్రశ్నించారు. ఆయన షేర్‌ చేసిన వీడియోలో…రెండు జట్లు మధ్య కబడ్డీ పోటీలు జరుగుతుంటాయి. అందులో ఓ జట్టు ఆటగాడు కూతకు వస్తాడు. డిఫెండింగ్‌ జట్టులో ఓ ఆటగాణ్ని తాకి ఔట్‌ చేస్తాడు. తిరిగి వెళ్తూ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ళను కవ్వించడం కోసం కోర్టు మధ్యలో ఉన్న గీత వద్దే ఆగిపోతాడు. ఇంతలో డిఫెండింగ్ జట్టులో ఔట్‌ అయిన ఆటగాడు లైన్‌ వద్దకు వచ్చి ఒక్క ఉదుటున ప్రత్యర్థి జట్టు ఆటగాణ్ని తమ వైపు లాగుతాడు. మిగిలిన జట్టు సభ్యులంతా అతడికి సహకరించి రైడర్‌ని గట్టిగా పట్టుకోవటంతో పాయింట్‌ గెలుచుకుంటారు.

నిజానికి చూసేవాళ్లందరికి పాయింట్‌ రైడర్‌ టీంకే అనుకుంటారు. కానీ చివరకు డిఫెండింగ్‌ ఆటగాడు చేసిన పనికి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. దాదాపు మహారాష్ట్రలో జరిగింది కూడా ఇదే. శివసేన, కాంగ్రెస్‌-ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని అందరూ అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా భాజపా నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరింది. కావున ఆనంద్‌ మహీంద్రా చేసిన ట్వీట్‌ సరిగ్గా సరిపోతుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది మహారాష్ట్ర తాజా పరిస్థితులకు సరిపోలే మరికొన్ని ఆసక్తికర వీడియోలను కూడా చేశారు. ఇంకా కొందరు ఓ అడుగు ముందుకేసి ఆ రైడర్‌ని శివసేన నేత సంజయ్‌ రౌత్‌తో పోల్చారు.

Related posts