telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్ దేవరకొండకు తమ్ముడి మద్దతు… “అర్జున్ రెడ్డి” విమర్శకులకు ఘాటు సమాధానం

vijay story with his brother anand

విజయ్ నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అయిపోతున్నా ఇంకా ఈ సినిమాను వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఛాన్స్ దొరికినప్పుడల్లా విజయ్‌పై ఈ సినిమాపై కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ఫిలిం కంపానియన్ అనే సంస్థ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో మలయాళ నటి పార్వతి.. విజయ్ దేవరకొండ ఎదుటే ‘అర్జున్ రెడ్డి’ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేసింది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండున్నరేళ్లు అవుతోంది. ఇంకా దీనిపై చర్చలు ఎందుకు? విని విని చిరాకేస్తోంది’ అని ట్వీట్ చేశారు. దీనిపై ఆనంద్ స్పందిస్తూ.. ‘సరిగ్గా చెప్పారు. నేనూ అదే అనుకుంటున్నా’ అంటూ తన అన్నపై కామెంట్స్ చేస్తున్నవారిని ఏకిపారేశారు. ఈ నేపథ్యంలో తన అన్నకు సపోర్ట్ చేస్తూ ఆనంద్ ట్విటర్‌లో తన అభిప్రాయాలను వెల్లడించారు. “అర్జున్ రెడ్డి క్యారెక్టర్‌లో చాలా లోపాలు ఉన్నాయి. కానీ అర్జున్‌కి కంట్రోల్ చేసుకోలేనంత కోపం ఉండటం వల్లే ఆ లోపాలు ఉన్నాయి. అతని కోపం వల్లే సినిమా రెండో భాగంలో మద్యానికి బానిస అవడం, అందరినీ కొట్టడం వంటివి చేస్తుంటాడు. ప్రేమను గొప్పగా చూపించడంలో తప్పేముంది? ఆ ప్రేమ ఎలాంటిదైనా కావచ్చు. రెవల్యూషనరీ రోడ్, బ్లూ వ్యాలెంటైన్, ది నోట్ బుక్ వంటి సినిమాల్లో కూడా ఇదే రకమైన అతిప్రేమను చూపించారు. నన్ను తప్పుగా అర్థంచేసుకోవద్దు. నేను వేధింపులు, బూతులు, రాక్షసులకు దూరంగా ఉంటాను. కానీ ఈ ఎలిమెంట్స్ ఏవీ అర్జున్ రెడ్డిలో లేవు. నాకు తెలిసి అర్జున్‌రెడ్డిని రివ్యూ చేసిన వాళ్లు, కామెంట్ చేసిన వాళ్లు పైన చెప్పిన సినిమాలన్నీ చూసే ఉంటారు. నాకు జోకర్ సినిమా నచ్చింది. ఒకవేళ సినిమాలో జోకర్ క్యారెక్టర్‌ను గొప్పగా చూపించకపోయి ఉంటే ఇక సినిమాలో ఏం చూడాలో నాకు తెలిసేది కాదు. జోకర్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ తెగ విజిల్స్ వేసేశారు. కానీ ఆ సినిమా చూసినవారంతా సినిమాలో చూపించినట్లు అందరినీ చంపుకుంటూ పోతారని అర్థంకాదు. ఒకవేళ ఆడియన్స్‌లో పిచ్చోడు ఉంటే తప్ప ఎవ్వరికీ సినిమాలో మెయిన్ క్యారెక్టర్‌లా అందరినీ చంపాలన్న ఆలోచన రాదు. కానీ సినిమాలను చూసి తప్పుగా ప్రవర్తించేవాళ్లకు సామాజిక విలువలు ఉండవు. అలాంటివాళ్లు తమని తాము సమర్ధించుకోవడానికి ఎన్నో సాకులు వెతుకుతూ ఉంటారు. వాళ్లను ఎలా మారుస్తాం? బహుశా సమాజంలోని పాలసీలను మారిస్తే వారిని సరిచేయగలమేమో. కానీ వారు అలా తయారవడానికి కారణం సినిమాలేనంటూ నిందిచొద్దు. ఇవన్నీ నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే” అని వెల్లడించారు ఆనంద్.

Related posts