telugu navyamedia
సినిమా వార్తలు

సామాజిక వేత్త కాళ్ళు మొక్కిన మెగాస్టార్… ఎందుకంటే ?

Amitab

బాలీవుడ్ మెగాస్టార్ 76 ఏళ్ళ వయసులోనూ కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ఇప్పటికీ భారీ క్రేజ్ తో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అమితాబ్. ఒక్క బాలీవుడ్ లోనే కాదు తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే ఏ భాషలోనైనా నటించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే తెలుగులో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “సైరా”లో కీలకపాత్రలో నటించారు. తమిళంలోనూ ఆయన తన తొలి సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం అమితాబ్, సాహోజిత్ సర్కార్ దర్శకత్వంలో “గులాబో సితాబో” అనే సినిమా చేస్తున్నారు. కామెడీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్ లుక్ హైలైట్‌గా ఉండబోతోంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న అమితాబ్ బచ్చన్ వృద్ధుడి పాత్ర గెటప్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. సినిమా ఇండస్ట్రీలోనే ఆయనకు ఎంతో మంది అభిమానులున్నారు. అంతేకాదు ఆయన ఎదురు పడితే.. ఆయన ఆశీర్వాదం తీసుకోవాలనే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి అమితాబ్ బచ్చన్ “కౌన్ బనేగా కరోడ్‌పతి” షోలో ఒక పెద్దావిడా కాళ్లు మొక్కడం చర్చనీయాంశం అయింది. సిందుతాయ్ అనే సామాజిక వేత్త గత కొన్నేళ్లుగా ఎంతో మంది అనాథలను చేరదీస్తూ అన్నీ తానై చూసుకుంటోంది. ఇటీవలే ప్రసారమైన ఎపిసోడ్‌లో సింధూతాయ్ పాల్గొన్నారు. ఈ చారిటీ ఎపిసోడ్‌లో సింధూతాయ్.. అమితాబ్‌ను తన కొడుకు అంటూ మరాఠీలో ఒక పద్యాన్ని పాడారు. ఈ వేదికపై అమితాబ్ ఆమె గురించి కొన్ని విషయాలు అడిగి ప్రేక్షకులకు తెలియపరిచారు. ఈ సందర్భంగా సింధూతాయ్ చెప్పిన విషయాలకు భావోద్వేగానికి లోనైనా అమితాబ్ బచ్చన్… సీటు నుంచి లేచి మరి ఆమెకు పాదాభివందనం చేసారు. ఈ వీడియోను అమితాబ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ “ఎంతో మందికి స్పూర్తిగా నిలిచిన ఈ మాతృమూర్తిని గౌరవించడాన్ని ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను” అంటూ ట్వీట్ చేసాడు.

Related posts