telugu navyamedia
crime hasyam news political trending

దొంగతనాలు చేయడానికి.. నిపుణులు కావాలి… ప్రకటన…గంటకు 5 వేలు

an extreme advertisement by

దొంగతనాలు అరికట్టడానికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకోవడమే కాదు ఇంకో ఉపాయం కూడా ఉంది అంటూ, దానిని చేసి చూపడానికి సిద్ధం కూడా అయ్యారు. లోకంలో కొందరు చేసేవి బహు విచిత్రంగా అనిపించినా, అవి ఫలితాలు ఇస్తే మాత్రం, అందరూ వారినే అనుసరించడం ప్రారంభిస్తారు. అప్పుడు వారిదో ట్రెండ్ అయి కూర్చుంటుంది. తాజాగా క్రిస్మస్ సందర్భంగా ఒక షాపు యజమాని తీసుకున్న నిర్ణయం ఇది. తన షాపులో దొంగతనాలు అరికట్టేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం మానేసి, దొంగతనాలు చేయడానికి నిపుణులు కావాలి.. అంటూ ఒక విచిత్ర ప్రకటన ఇచ్చేసాడు. ఈ ప్రకటన అందరిని ఆశ్చర్యపరిచినా కూడా ఆ యజమాని మాత్రం వెనక్కి తగ్గడంలేదు.

తన షాపు 2013లోప్రారంభించినప్పటి నుండి దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నందున తాను ఇలాంటి ప్రకటన ఇచ్చానని ఆ యజమాని చెపుతున్నాడు. ఈ ప్రకటన చూసి వచ్చిన దొంగలు తమ షాపులో దొంగతనాలు చేసుకోవడమే కాకుండా, అసలు దొంగలు దొంగతనాలు ఎలా చేస్తారో వివరించాలని ఒక నియమం పెట్టారు. ఎవరైతే ఈ నియమాలకు అనుగుణంగా షాపులో పనికి ఒప్పుకుంటారో వారికి గంటకు 5వేలు ఇస్తారట. అలాగే దొంగతనం చేసిన వస్తువులలో మూడింటిని తీసుకెళ్లవచ్చట. అయితే ఈ ప్రకటనకు ఎంతమంది స్పందిస్తారో చూడాలి. ఈ ప్రకటన బ్రిటన్ కు చెందిన ఒక సంస్థ ఇచ్చింది. 

Related posts

మాజీ స్పీకర్ కోడెల కుమార్తెపై కేసు!

vimala p

పాదయాత్రకు సిద్దమైన .. లోకేష్ బాబు..! నిబంధనలు వర్తిస్తాయి.. !!

vimala p

ఐసీసీ నిబంధనలకు .. తలొగ్గిన బీసీసీఐ..ధోని గ్లోవ్ పై లోగో..

vimala p