telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రేమ పెళ్ళి చేసుకోబోతున్న మరో స్టార్ హీరోయిన్

Amy-Jackson

గత సంవత్సరం బాలీవుడ్ లో బాగానే పెళ్లిబాజాలు మోగాయి. దీపికా పదుకొనె – రణ్వీర్ సింగ్, ప్రియాంక చోప్రా – నిక్ జోనస్, సోనమ్ కపూర్ – ఆనంద్ ఆహూజా, శ్వేతాబసు ప్రసాద్ ఇలా హీరోయిన్లు తమకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకుని పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. ఈ ఏడాదిలో కూడా కొంతమంది బాలీవుడ్ నటీనటులు పెళ్ళి చేసుకోబోతున్నారు. ఈ జాబితాలో అర్జున్ కపూర్ – మలైకా అరోరా ముందువరుసలో ఉన్నారు. వీరు ఈ ఏడాది పెళ్ళి చేసుకునే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

తాజాగా మరో స్టార్ హీరోయిన్ తన పెళ్ళి విషయంపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. హాట్ బ్యూటీ అమీజాక్సన్ త్వరలో తన ప్రియుడిని పెళ్లాడబోతోంది. “”జనవరి 1, 2019.. అడ్వెంచర్ లైఫ్ ని మొదలుపెట్టబోతున్నాం.. నిన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను.. నాకు ఎంతో సంతోషాన్ని పంచే నీకు ధన్యవాదాలు” అంటూ అమీ ప్రియుడు జార్జ్ తో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు ఆమె చేతికి డిమాండ్ రింగ్ కూడా ఉండడం, ఈ ఫొటోలో అమీ బాయ్ ఫ్రెండ్ ఆమెను ముద్దుపెట్టుకోవడంతో వీళ్లిద్దరికీ నిశ్చితార్థం అయ్యిందని, ఈ జంట త్వరలోనే పెళ్ళి కూడా చేసుకునే అవకాశం ఉందనే అభిప్రాయానికి వచ్చేశారు ప్రేక్షకులు. అంటే ఈ ఏడాది ఈ హాట్ బ్యూటీ కూడా పెళ్ళి చేసుకుని ఇల్లాలిగా మారిపోతుందన్నమాట.

Related posts