telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

జమ్మూ కాశ్మీర్ సమస్యను.. రాజకీయం చేస్తూ .. వివాదంలో .. అమిత్ షా !

amitsha about 370 article in campaign

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. జాతీయ భద్రత విషయంలో తాము రాజీ పడబోమని వ్యాఖ్యానించారు. జార్ఖండ్ లో ఈరోజు జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.

కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో పాక్ ఉగ్రసంస్థలు భారత్ ను లక్ష్యంగా చేసుకునేవని అమిత్ షా అన్నారు. భారత్ నుంచి కశ్మీర్ ను వేరు చేయాలన్న పాక్ కల ఎన్నటికీ నెరవేరదన్నారు. ‘పాకిస్థాన్ నుంచి ఓ తూటా భారత్ వైపు వస్తే.. భారత్ నుంచి ఓ ఫిరంగి గుండు పాక్ కు వెళుతుంది’ అని హెచ్చరించారు.

Related posts