telugu navyamedia
సినిమా వార్తలు

వర్షంలో అభిమానులు… భావోద్వేగానికి గురైన అమితాబ్

Amitab Bachchan Tweet on RGV

బాలీవుడ్ మెగాస్టార్ 76 ఏళ్ళ వయసులోనూ కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ఇప్పటికీ భారీ క్రేజ్ తో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అమితాబ్. ఒక్క బాలీవుడ్ లోనే కాదు తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే ఏ భాషలోనైనా నటించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే తెలుగులో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “సైరా”లో కీలకపాత్రలో నటించారు. తమిళంలోనూ ఆయన తన తొలి సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం అమితాబ్, సాహోజిత్ సర్కార్ దర్శకత్వంలో “గులాబో సితాబో” అనే సినిమా చేస్తున్నారు. కామెడీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్ లుక్ హైలైట్‌గా ఉండబోతోంది. అయితే ఆయన రీల్ లైఫ్ లో కనిపించే మంచి గుణమే రియల్ లైఫ్ లో కూడా కనిపిస్తుంటుంది. రైతులకు సాయం అందిస్తూ జవాను కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం చేస్తుంటారు. ఇక అమితాబ్ ని చూసేందుకు అభిమానులు ప్రతి ఆదివారం ఆయన ఇంటికి చేరుకుంటూ ఉంటారు. అమితాబ్ కూడా వీలైనంత వరకు ఫ్యాన్స్ ను కలుసుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల వర్షం పడినా కూడా అభిమానులు అక్కడే అమితాబ్ కోసం వెయిట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక అమితాబ్ అయితే ఎమోషనల్ అయ్యారు. ఇలాంటి ప్రేమను పొందుతున్నందుకు చాలా అదృష్టవంతుడిని. వర్షంలాగే మీ ప్రేమ కూడా జోరున తనపై కురిసిందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

Related posts