టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి నేను ఎన్నో సలహాలు ఇచ్చానని బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ తెలిపారు. సైరా చిత్రంలో చిరంజీవికి గురువుగా నటించిన అమితాబ్ తన పాత్ర పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ ఈవెంట్లతో బిజీ అయింది.
తాజాగా చిరంజీవి, అమితాబ్ లను ముంబయిలో నటుడు ఫర్హాన్ అక్తర్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భం అమితాబ్ తన మిత్రుడు చిరంజీవి గురించి మాట్లాడుతూ రాజకీయాల్లోకి వెళ్లొద్దని చిరంజీవికి చెప్పానని, కానీ ఆయన తన మాట వినలేదని అన్నారు. తాను చిరంజీవికి ఎన్నో సలహాలు ఇచ్చినా ఆయన ఏ కొన్నింటినో పాటిస్తారు తప్ప అన్నీ పాటించరని అమితాబ్ తెలిపారు.