telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తన ఆరోగ్యంపై అమితాబ్ షాకింగ్ కామెంట్స్

Amitab Bachchan Tweet on RGV

ఓ జాతీయ మీడియా నిర్వహించిన హెల్త్ అవేర్‌నెస్ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ తన ఆరోగ్యం గురించిన సంచలన విషయాలను బయటపెట్టారు. 76 ఏళ్ల అమితాబ్ బచ్చన్ పలు ఆరోగ్య అవగాహనా కార్యక్రమాలకు ప్రచారకర్తగా ఉన్నారు. పోలియో, హైపటైటిస్-బీ, క్షయ, డయాబెటిస్ వంటి వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు బిగ్‌బీ. హెల్త్ అవేర్‌నెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ తన లివర్‌లో 75 శాతం పూర్తిగా దెబ్బతిందని.. మిగిలిన 25 శాతం కాలేయంతోనే తాను జీవిస్తున్నానని వెల్లడించారు. అంతేకాదు గతంలో క్షయ, హైపటైటిస్ బీ వంటి వ్యాధులతో పోరాడానని తెలిపారు. అంతేకాదు తనకు క్షయవ్యాధి ఉందన్న విషయాన్ని 8 ఏళ్లు ఆలస్యంగా గుర్తించానని చెప్పారు. ఆరోగ్య పరీక్షలు చేయించుకోకపోవడం వల్లే వ్యాధి ఉందన్న సంగతి తెలియలేదు. ఆరోగ్య పరీక్షలు చేయించుకోకపోతే మీకు ఏం వ్యాధి ఉందో తెలియదు. అందుకే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, అప్పుడే ఆరోగ్య సమస్యల నుంచి తొందరగా బయటపడే అవకాశం ఉంటుందని సూచించారు.

Related posts