telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

మేము అందుకు 500 కోట్లు ఇచ్చాము : షా

Amit Shah

గ్రేటర్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌ వచ్చిన అమిత్‌షా.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ రోజు రోడ్ షో తో స్పష్టమైంది.. మేయర్ బీజేపీదే అనే ధీమా వ్యక్తం చేశారు. మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ పై ఉంటుంది.. కానీ, హైదరాబాద్‌లో ఐటీ హబ్‌కి అడ్డంకి.. టీఆర్ఎస్, ఎంఐఎంల పాలనే కారణం అన్నారు. ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చి చూడు.. లక్ష ఇళ్లు ఏమయ్యాయని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు అమిత్‌షా.. లక్షా 35 వేల ఇళ్లను మంజూరు చేస్తే 11 వందలు కూడా కట్టలేదని ఆరోపించిన ఆయన.. 15 డంప్ యార్డ్స్ ఎక్కడ.. 10 వేలు కోట్లు ఎక్కడ ఖర్చు చేశావు.. హుస్సేన్ సాగర్ శుద్ధి ఎక్కడ? మూసిపై 6 లైన్ల రోడ్‌ ఏది.. హైదరాబాద్ చుట్టూ నాలుగు హాస్పిటల్స్ ఏమయ్యాయి అని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధాని మోడీయే రెండు ఆస్పత్రులు కట్టించారన్న షా.. మరోవైపు.. రాజకీయ కారణాలతో ఆయుష్మాన్ భారత్ అమలు చేయడం లేదని విమర్శించారు. హైదరాబాద్ లో 30 వేల మంది వీధి వ్యాపారులకు లోన్ ఇచ్చాము.ఇక, వరద సహాయం కింద హైదరాబాద్‌కి 500 కోట్లు ఇచ్చాం, రెగ్యులర్ గా సెక్రటేరియట్ కి వెళితే అన్ని తెలుస్తాయి అంటూ ఎద్దేవా చేశారు.

Related posts