telugu navyamedia
రాజకీయ వార్తలు

రాష్ట్రపతి పాలన తీర్మానానికి మద్దతివ్వండి: అమిత్ షా

TDP Mla anitha comments Roja YCP

జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన జూలై 3వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆర్టికల్‌ 356 ప్రకారం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను పొడగించే తీర్మానాన్ని ఇప్పటికే కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర‌ప‌తి పాల‌న‌ను ఆర్నెళ్లు పొడిగించాల‌న్న బిల్లును ఇవాళ రాజ్య‌స‌భ‌లోకేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్ర‌వేశ‌పెట్టారు.

రేప‌టితో క‌శ్మీర్‌లో ఆర్నెళ్ల రాష్ట్ర‌ప‌తి పాల‌న గ‌డువు ముగుస్తుంది. జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన పొడగింపునకు సమాజ్‌వాదీ పార్టీ మద్దతు తెలుపగా, కాంగ్రెస్‌ పార్టీ మాత్రం వ్యతిరేకిస్తోంది. రంజాన్‌ పండుగ, అమర్‌నాథ్‌ యాత్ర వంటి సాకులతో జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయడం సరికాదని కాంగ్రెస్‌ ఎంపీ విప్లవ్‌ ఠాకూర్‌ కేంద్రం తీరును తప్పుబట్టారు. త్వరలో అమర్‌నాథ్‌ యాత్ర ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు.

Related posts