telugu navyamedia
రాజకీయ వార్తలు

శివసేన వైఖరి వల్లే “మహా” ప్రతిష్టంభన: అమిత్ షా

amitsha about 370 article in campaign

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించగా కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా తొలిసారిగా స్పందించారు. తాజాగా ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించే పార్టీలు, మెజారిటీ ఎమ్మెల్యేలతో వచ్చేందుకు ఆరు నెలల సమయం ఉందని అన్నారు.

ఇక శివసేనతో పొత్తుపై ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా, తాను, ప్రధాని నరేంద్ర మోదీ, పలు బహిరంగ సభల్లో తమ కూటమి గెలిస్తే.. దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పామని అన్నారు.ప్రజలు తమను నమ్మి కూటమిని గెలిపించారని అన్నారు. సీఎం అభ్యర్థిత్వంపై నాడు అభ్యంతరం చెప్పని శివసేన, ఇప్పుడు సాధ్యం కాని డిమాండ్లను తెరపైకి తెచ్చిందని అన్నారు. ఆ డిమాండ్లు తమకు ఆమోదయోగ్యం కాదని, శివసేన వైఖరి వల్లే ఈ ప్రతిష్టంభన ఏర్పడిందని అన్నారు.

Related posts